YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కృష్ణానది లో రైతులు, మహిళలు జలదీక్ష

కృష్ణానది లో రైతులు, మహిళలు జలదీక్ష

కృష్ణానది లో రైతులు, మహిళలు జలదీక్ష
అమరావతి జనవరి 28  
రాజధాని గ్రామాలలో 42వ రోజు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాయపూడి వద్ద కృష్ణానది లో రైతులు, మహిళలు జలదీక్ష చేపట్టారు. నీటిలో ఉండి వారు ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆనాడు గ్రామగ్రామానికి‌ వచ్చి ముద్దు లు పెట్టిన జగన్ నేడు‌ గుద్దులు గుద్దుతున్నాడని వారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు కావాలని ఎవరు అడిగారు? అని వారు ప్రశ్నించారు. విశాఖ ప్రజలు వచ్చి రాజధాని కావాలని నిన్ను అడిగారా? అంటూ వారు ప్రశ్నలు సంధించారు.రాజధాని కోసం భూములు ఇచ్చిన తమను ప్రభుత్వం అవమానిస్తున్నదని వారు అన్నారు. రాజన్న రాజ్యం వస్తుందంటే నమ్మి ఓట్లేశాం. అయితే ఇలాంటి నియంత పాలన ఎక్కడా చూడలేదని వారన్నారు. అనుకున్నది జరగపోతే వ్యవస్థ లను రద్దు చేయడం దారుణమని వారు తెలిపారు. అమరావతి రాజధాని గా 30వేల ఎకరాలు కావాలని జగన్ అన్నది వాస్తవం కాదా అని వారు ప్రశ్నించారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి.. లేకుంటే ఆత్మహత్య లే మాకు శరణ్యం అని వారు నినాదాలు చేశారు.

Related Posts