YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

స్మార్ట్ ఫోన్ల వినియోగం లో అమెరికా ను మించిన ఇండియా 

స్మార్ట్ ఫోన్ల వినియోగం లో అమెరికా ను మించిన ఇండియా 

స్మార్ట్ ఫోన్ల వినియోగం లో అమెరికా ను మించిన ఇండియా 
న్యూ ఢిల్లీ జనవరి 28  
అభివృద్ధి చెందిన రాజ్యాలలో అగ్రరాజ్యంగా కొనసాగుతుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ తాజాగా అమెరికాని మన ఇండియా క్రాస్ చేసింది. అదేంటి అభివృద్ధి చెందిన అమెరికా ని ..మన ఇండియా దాటేయడం ఏంటా అని ఆలోచిస్తున్నారా? అవునండి మీరు చదివేది నిజమే అమెరికాని ఇండియా బీట్ చేసింది. కానీ మీరు అనుకున్నట్టుగా అభివృద్ధి లో కాదు. స్మార్ట్ ఫోన్ మార్కెట్ విషయం లో.ప్రపంచ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మొదటి స్థానం లో ప్రస్తుతం చైనా ఉండగా రెండో స్థానం లో అమెరికా ఉండేది. అయితే అది ఇప్పుడపు గతం. ప్రస్తుతం 2019 చివరి లెక్కల ప్రకారం స్మార్ట్ఫోన్ మార్కెట్ విషయంలో ఇండియా అమెరికా ను దాటి రెండో స్థానానికి చేరుకుంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అంతర్జాతీయ సర్వే ప్రకారం - ప్రపంచంలో ఇప్పుడు రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్ అమెరికా కాదు ఇండియా. ఇది ఎలా సాధ్యం అయిందీ అంటే 2019లో ఇండియా లో దాదాపు 16 కోట్ల ఫోన్లు స్మార్ట్ ఫోన్లు అమ్ముడు పోయాయట.మెయిన్ బ్రాండ్స్ మొదలుకొని చైనీస్ బ్రాండ్స్ వరకూ ఎన్నెన్నో రకాల స్మార్ట్ ఫోన్లను ఈ యేడు భారతీయులు కొన్నారు. ఈ యేడాది ఇండియాలో ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి ఇ-కామర్స్ సైట్ల ద్వారా స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోవడం ఎంతో ప్రభావాన్ని చూపింది. ఫలితంగా ఇండియా ఇప్పుడు అమెరికా ను దాటి ప్రపంచపు రెండవ పెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా అవతరించగలిగింది. ఇది ఒకవిధంగా సంతోషించదగ్గ విషయం అయినా మన భారతీయులం స్మార్ట్ ఫోన్ల పై ఎంతగా ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తోంది.

Related Posts