YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆకట్టుకుంటున్న కేన్ ఫర్నిచర్

ఆకట్టుకుంటున్న కేన్ ఫర్నిచర్

ఆకట్టుకుంటున్న కేన్ ఫర్నిచర్
ఒంగోలు, 
న్‌ ఫర్నిచర్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. వివిధ వెరైటీల్లో ఫర్నిచర్‌ ప్రియులను ఫిదా చేస్తోంది. చూడటానికి అందంగా, వాడటానికి సులభంగా, శరీరానికి ఆరోగ్యానిచ్చేదిగా కేన్‌ ఫర్నిచర్‌కు పేరుంది. కేన్‌ను తెలుగులో ''పేకచెత్తం'' అని పిలుస్తారు. సాధారణంగా ప్రస్తుత ప్రజానీకానికి కేన్‌ అనే పదమే సుపరిచితం.కేన్‌కు దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది. ఇది దీవుల పక్కన పండుతుంది. ఎక్కువగా అండమాన్‌లో. మన దేశంలో అయితే అస్సాంలో ఎక్కువగా పండుతుంది. ఇది వెదురు కర్రలా దాదాపు 13 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. నగరంలో మొదట్లో నాలుగైదు షాపులు ఉండేవి. కాల క్రమంలో రెండు మాత్రమే మిగిలాయి. వీటిలో ఎక్కువ వ్యాపారం నిర్వహిస్తున్నది మాత్రం రైల్వేన్యూ కాలనీలోని ఉదయ భాను కేన్‌ ఫర్నిచర్‌ మాత్రమే. వీరు అండమాన్‌ నుంచి 13 అడుగుల పొడవైన కర్రను ఓడల ద్వారా కోల్‌కతాకు దిగుమతి చేసుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో విశాఖకు తెచ్చుకుంటారు. ఇక్కడ దీనిని కావాల్సిన సైజులో కంటే చేసుకుని వస్తువులను తయారు చేస్తారు.ఈ వ్యాపారాన్ని ఉదయభాను తండ్రుల కాలంలో సుమారు 80 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. వీరి తండ్రులు మొదట్లో నాటి మద్రాసు పట్టణస్త్రలోని పని నేర్చుకుని 70 ఏళ్ల క్రితం కాకినాడలో వ్యాపారాన్ని ప్రారంభించారు. నేటికీ అక్కడ వీరి వ్యాపారం సాగుతోంది. విశాఖలో 1995లో కేన్‌ ఫర్నిచర్‌ వ్యాపారం ప్రారంభించారు.దాదాపు 20 ఏళ్ల క్రితం సంపన్నులు మాత్రమే ఈ కేన్‌ ఫర్నిచర్‌ వాడేవారు. హాల్స్‌లో, లాన్స్‌లో ఊయలలు, కార్నర్‌ రేక్‌లు, రిలాక్సింగ్‌ కుర్చీలు లాంటివి వారి సౌకర్యాలకు అనుగుణంగా తయారు చేయించుకునే వారు. కాల క్రమంలో మధ్య తరగతి ప్రజలు కూడా వీటిని వాడటం ప్రారంభించారు. వీటిని ఒకసారి తయారు చేస్తే 30 సంవత్సరాలు మన్నుతాయి. అప్పుడప్పుడు పాలిష్‌ చేసుకుంటూ, జాగ్రత్తగా వాడితే ఎంత కాలమైనా మన్నుతుంది. సాధారణంగా వేసవిలో అమ్మకాలు బాగుంటాయి.ఈ ఫర్నిచర్‌తో చేసిన కుర్చీలు, సోఫాలు, రాకింగ్‌ చెయిర్‌లు, హేంగింగ్‌ చెయిర్స్‌లాంటి వాటిని కుషన్‌ లేకుండా వినియోగంతో శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుందని, స్పైషల్‌ సమస్యలు వంటివి రావని వైద్యులు కూడా అంటారు.రైల్వే న్యూ కాలనీ మెయిన్‌ రోడ్డులో ఉన్న షాపుల్లో అమ్మకాలు మాత్రమే కాకుండా అమ్మకాల అనంతరం సర్వీసు కూడా అందిస్తున్నారు. రిపేర్లు, పాలిషింగ్‌, లాంటి పనులను వారి ఇళ్ల వద్దగాని, లేదా షాపు వద్ద గానీ వీరు చేస్తుంటారు.కేన్‌తో చేయలేని ఫర్నిచర్‌ వస్తువులంటూ లేవు. మొదట్లో కేవలం ఊయలలు మాత్రమే ఎక్కువగా తయారు చేసేవారు. కానీ నేడు లాన్‌లో వేలాడే ఊయలలు, హేంగింగ్‌ కుర్చీలు, సోఫాసెట్స్‌, స్కూల్స్‌, టీపారులు అలమరాలు, లాండ్రీ బాస్కెట్స్‌, పూజ బుట్టలు, రాకింగ్‌ చెయిర్స్‌, ఇలా ప్రతి ఫర్నిచర్‌ను కూడా కేన్‌తో మలచడం వీరి ప్రత్యేకత. వీటిని తయారు చేయడానికి నిష్ణాతులైన పని వారిని మాత్రం మంగుళూరు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు నుంచి తీసుకు వస్తారు. స్థానికంగా ఉన్న పని వారు మాత్రం పేపరింగ్‌, పాలిషింగ్‌ వంటి పనులు చేస్తుంటారు. కేన్‌ ఊయల ధర ఒకటి రూ.3800, సోఫా ధర రూ.3,000, పూజ సజ్జ ఒకటి రూ.500, స్టూల్‌, టీపారులు సైజును బట్టి రూ.600 నుంచి రూ.800 వరకు ఉన్నాయి.

Related Posts