YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరులో ఏసీబీ దాడులు

చిత్తూరులో ఏసీబీ దాడులు

చిత్తూరులో ఏసీబీ దాడులు
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగుల్లో అలజడి
వరుస దాడులతో బెంబేలెత్తిపోతున్న ఉద్యోగులు
చిత్తూరు 
ఏపీ ప్రజలకు అవినీతిరహిత పాలన అందించేందుకు సీఎం జగన్ పక్కా వ్యూహ రచనతో ముందుకు అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిపరుల సమాచారం ప్రభుత్వానికి తెలియజేయాలంటూ 144-00 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ప్రారంభించారు. దీంతో కొన్నేళ్లుగా అవినీతి అధికారుల తీరుతో విసిగిపోయిన ప్రజలు 144-00 నెంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదులు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనీఖీలు చేపట్టారు. లంచం తీసుకుని పనిచేస్తున్న అవినీతిపరుల కూపిలు లాగే పనిలో అదికారులు గత కొద్ది రోజులుగా తహసీల్దార్‌ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. 
చిత్తూరు జిల్లాలోని రేణిగుంట, వడమాల పేట, మదనపల్లి, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు తహాసీల్దార్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆయా కార్యాలయాల్లోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్,  ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వివరాలను సేకరించి... వారిని విచారణ చేశారు. అంతేకాంకుడా అనుమానంగా కనిపించిన అధికారులను అదుపులోకి ఆరా తీశారు. రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకుని గత వారం రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు ముమ్మర తనిఖీలు చేస్తూ ఫైల్లను పరిశీలిస్తున్నారు.
రెవెన్యూ కార్యాలయాలకు సాదారణ వ్యక్తులుగా వచ్చి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన దాడులపై... ఇకముందు జరిగే దాడుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేధిక ఇస్తామని ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేందుకే సోదాలు చేస్తున్నట్లు  ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ స్పష్టం చేస్తున్నారు. 
ఏ సమయంలో అవినీతి నిరోదక అధికారులు ఏ కార్యాలయంపై దాడులు చేస్తారో తెలియక రెవెన్యూ ఉద్యోగులు బెంబేలేత్తిపోతున్నారు. ఏసీబీ దాడులు ముమ్మరం అవడంతో  ఉద్యోగులు అప్రమత్తమవుతున్నారు

Related Posts