శ్రీమఠంలో ఘనంగా సుజయీంద్ర తీర్థుల ఆరాధన.
కొత్త గదుల సముదాయం ప్రారంభ
మంత్రాలయం
పూర్వ పీఠాధిపతులు శ్రీ సజయీంధ్ర తీర్థుల ఆరాధన పీఠాధిపతుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సుజయీంద్ర తీర్థ మూల బృందావనానికి అర్చకులు తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. పీఠాధిపతులు పూల రాముల పూజల అనంతరం సుజయీంధ్ర తీర్థుల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్రపటాన్ని నవరత్న రథోత్సవంపై ఉంచి శ్రీ మఠం మాడవీధుల్లో ఘనంగా ఊరేగించారు.పూర్వ పీఠాదిపతులు శ్రీ సుజయీంధ్రుల కాలంలో మంత్రాలయం,శ్రీ మఠం అభివృద్ధి గురించి పీఠాధిపతులు భక్తులకు తెలియజేశారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం భక్తుల విరాళాలతో నిర్మించిన వాధీంధ్ర తీర్థుల గదుల సముదాయాన్ని భక్తుల సమక్షంలో పీఠాధిపతులు ప్రారంభించారు.అనంతరం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు 100 రూపాయలకే గదుల సముదాయాన్ని కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు భక్తులు పాల్గొన్నారు.