YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మండలి రద్దుకు అభ్యంతరాలు ఉంచడకపోవచ్చు

మండలి రద్దుకు అభ్యంతరాలు ఉంచడకపోవచ్చు

మండలి రద్దుకు అభ్యంతరాలు ఉంచడకపోవచ్చు
న్యూఢిల్లీ, 
ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సూచనల మాత్రమే చేస్తుందని, ఆ సూచనలపై అంతిమ నిర్ణయం పార్లమెంటు తీసుకుంటుందని తెలిపారు. మండలి రద్దు విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన తేల్చి చెప్పారు.మండలి రద్దు అంశాన్ని కేంద్రం రాజకీయ కోణంలో చూడటం లేదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారమే ప్రక్రియను ముందుకు తీసుకెళతామని స్పష్టం చేశారు. ఆలస్యం చేయడం, తొందరగా పూర్తి చేయడం లాంటివేవీ ఉండబోవన్నారు. మండలి రద్దు తీర్మానాన్ని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన లేదని ఆయన తేల్చి చెప్పారు. వ్యవస్థకు లోబడే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. 169 (1) ప్రకారం అసెంబ్లీ.. తీర్మానం చేస్తే దాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఇందులో తాము చేసేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు.కొందరు కావాలనే కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ అంశంలో రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తామని జీవీఎల్ తెలిపారు. తమ పార్టీకి మంచి జరుగుతుందనో, చెడు జరుగుతుందనో చూడట్లేదని.. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం అడుగులు వేస్తుందని ఆయన వివరించారు.

Related Posts