ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ అధికారి పై వేటు
కడప
కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లో మహిళా సెక్యూరిటీ గార్డులను లైంగికంగా వేధిస్తున్న ట్రిపుల్ ఐటీ ఎస్ఓ అర్జున్ నాయక్ పై సస్పెంషన్ వేటు పడింది. కడప జిల్లాలోని వేంపల్లె మండలంలో ఉన్న ట్రిపుల్ ఐటీ లో ఎస్ఓగా సిఐ అర్జున్ నాయక్ పనిచేస్తున్నాడు. మహిళా సెక్యూరిటీ గార్డుల పట్ల సిఐ అర్జున్ నాయక్ లైంగికంగా వేధిస్తున్నాడనీ, అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆరోపణలు రావడంతో అదికారులు అతనిపై విచారణ చేపట్టారు.దీంతో రుజువు కావడంతో విదులు నుంచి తప్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.