YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు అరుదైన అవకాశం

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు అరుదైన అవకాశం

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు అరుదైన అవకాశం
ప్రధానమంత్రి అవార్డుల సంబంధించిన సవరణలపై సలహాలు ఇచ్చే ప్యానెల్ లో కలెక్టర్ కు చోటు
సిరిసిల్ల 
ప్రజా పరిపాలన లో అత్యున్నత ఫలితాలు చూపినందుకు అఖిల భారత సర్వీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఎక్సలెన్స్ అవార్డులను ఏటా సివిల్ సర్వీసెస్ దినోత్సవం రోజున ఇస్తున్న విషయం తెలిసిందే. కాగా 2020 సంవత్సరంకు గానూ ప్రధానమంత్రి అవార్డుల సంబంధించిన సవరణలపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కేవలం 15 జిల్లాల కలెక్టర్ లను ఆహ్వానం పంపింది . ఈనెల 28న మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరింది.
దేశవ్యాప్తంగా మొత్తం 732 జిల్లాలు ఉండగా 15 జిల్లాల కలెక్టర్ లకు మాత్రమే ప్రధానమంత్రి అవార్డుల సంబంధించిన సవరణలపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందగా దక్షిణ భారతదేశం నుంచి 4 జిల్లాల కలెక్టర్ లకు ఆహ్వానం అందింది .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విశాఖపట్నం కలెక్టర్ కు ఈ అవకాశం దక్కగా తెలంగాణ రాష్ట్రం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్ కు ఈ అరుదైన అవకాశం దక్కింది. కొత్త జిల్లాల పరంగా చూసుకుంటే ఈ అవకాశం దక్కించుకున్న ఏకైక జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా కావడం విశేషం. కాగా గ్రామీణ అభివృద్ధి ,మౌలిక వసతుల కల్పన , విద్యాభివృద్ధి కి సంబంధించి ప్రధానమంత్రి అవార్డులలో చేపట్టాల్సిన సవరణలు ,సూచనలను పరిపాలన సంస్కరణలు,ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శికి జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్ నుండి విడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసారు

Related Posts