భగవంతుని చేరాలంటే భక్తి ఉంటేనే సాధ్యం ఆర్లబండ తాత
తాత ఆరాధన ,తూలబరం ఉత్సవాల్లో భారీగా భక్తులు
కౌతాళం
భక్తీ శ్రద్దలతో నే ముక్తికి మార్గమని,భగవంతుని చేరాలంటే భక్తితో నే సాధ్యం అని శ్రీ కృష్ణ అవదూత ఆశ్రమం పీఠాధిపతి ఆర్లబండ తాత సూచించారు. బుదవారం కౌతాళం లో 45 వ శ్రీ సద్గురు కృష్ణ అవదూత స్వామి వారి వార్షికోత్సవం భారీగా నిర్వహించారు. భారీగా పీఠాధిపతి తాతా ను పురవీధుల్లో ఊరేగింపుగా నిర్వహించారు. ఊరేగింపులో మహిళలు దీపాలతో, మేళతాలలతో నామస్మరణతో ఘనంగా నిర్వహించారు.తెలుగుదేశం నాయకులు ఉలిగయ్య, వైసీపీ నాయకులు దేశాయి కృష్ణ తాతా ను దర్శించుకున్నారు. సాయంత్రం మాజీ ఉరుకుంద పాలకమండలి చైర్మన్ చెన్న బసప్ప ,బీజేపీ కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో కృష్ణ అవదూత ఆశ్రమం లో పీఠాధిపతి కి,వారి సతీమణి లకు తూలబరం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ తులబారం వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రాలయం ఇన్ ఛార్జ్ పురుషోత్తం రెడ్డి హాజరయ్యారు. సన్నివేశాలు తిలకించారు. ఈ వార్షికోత్సవం లో 7 గురు జంటలు సామూహిక వివాహాలు తో ఒక్కటయ్యారు. వచ్చిన మండల ప్రజలకు, భక్తులకు గ్రామపెద్దలు దగ్గరుండి సౌకర్యాలు కల్పించారు. వచ్చిన అతిథిలుకు, ప్రజలకు భోజన వసతులు కల్పించారు. ఆశ్రమం అంత పండుగ,జాతర, వాతావరణం నెలకొంది. ఈ మూడు రోజులు ఆరాదనోత్సవాలు పాల్గొన్న భక్తులకు గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు, టీడీపీ వైసీపీ, బీజేపీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.