Highlights
*పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖముఖీ *జాతీయ షెడ్యూలు తెగల కమిషన్ చైర్మన్ శ్రీ నందకుమార్ సాయి* జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సౌకర్యాల పట్ల నిర్వాసితులు సంతృప్తి జాతీయ షెడ్యూలు తేగల కమిషన్ చైర్మన్ శ్రీ నందకుమార్ సాయి పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సౌకర్యాల పట్ల నిర్వాసితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని జాతీయ షెడ్యూలు తేగల కమిషన్ చైర్మన్ శ్రీ నందకుమార్ సాయి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి మంగళవారం పోలవరం మాధవపురం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో అయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వలన అనేక గిరిజన గ్రామాలు ముంపున కు గురి అయ్యాయని నష్టపోయిన రైతులకు పునరావాసంగా భూములు, ఇల్లు, ఇతర మౌలిక సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని ఆ సౌకర్యాలు పట్ల ముంపు గ్రామ ప్రజలు సంతృప్తి చెందింది లేనిది తెలుసుకునేందుకు రెండు రోజులుగా పోలవరం ముంపు గ్రామాలలో పర్యటించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు వేరొక ప్రాంతంలో ఇల్లు,పొలాలు ఇచ్చి తరలించడం వలన వారి అభిప్రాయాలూ అడిగి తెలుసుకున్నామని చైర్మన్ శ్రీ నందకుమార్ సాయి చెప్పారు. ఆవులు, గేదలు, పశువులు క్రొత్త ప్రాంతానికి తరలించడం వలన వారి జీవనప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో, పిల్లలకు విద్యాసౌకర్యాలు, వైద్యసౌకర్యాలు, త్రాగునీరు, ఇతర సౌకర్యాలు పట్ల సంతృప్తిగా ఉన్నది లేనిది అడిగి తెలుసుకున్నామని, వారంతా ప్రభుత్వం అందించిన పునరావాస సౌకర్యాలు పట్ల పూర్తి సంతృప్తి వక్తం చేస్తారన్నారు. జాతీయ ప్రాజెక్ట్ పోలవరం నిర్మాణం నూతన సాంకేతిక ప్రమాణాలతో నిర్మాణం జరుగుతోందని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్ట్ వలన పశ్చిమగోదావరి జిల్లాకే కాకుండా ఇతర జిల్లాలలో కూడా సాగు,త్రాగునీరు సంవృద్ధిగా అందుతుందని ఆయా ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని తామంతా పూర్తిగా భావిస్తున్నామని అయన అభిప్రాయం వ్యక్తంచేశారు .ఈ కార్యక్రమంలో ఎస్.టి కమిసన్ వైస్ చైర్మన్ మిస్ వికె. అనసూయ,హర్దివా సునీలా వాసన్,హరికృష్ణ దామోదర్, సభ్యులు మాయ చింతామర్,శ్రీ రాఘవ్ చంద్ర (కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ), జాయింట్ సెక్రటరీ శ్రీ ఎస్. కుమార్ రాథోడ్ ,డిప్యూటీ సెక్రటరీ శ్రీ పిటి .జమేస్ట్ కుట్టీ, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ కాటంనేని భాస్కర్, అర్ అండ్ అర్ కమిషనర్ రేఖా రాణి, ఐటిడిఏ పిఓ శ్రీ ఏంఎన్, హరీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.