YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తెలంగాణ లో నానాటికి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్

తెలంగాణ లో నానాటికి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్

తెలంగాణ లో నానాటికి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
హైదరాబాద్ జనవరి 30
’తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ నానాటికి పెరిగి పోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి బాసట గా నిలుస్తోంది అని ఆయన చెప్పారు .మింట్ కాంపౌండ్ ప్రాంగణంలోనీ యస్ పి డి యస్ ఎల్ కార్యాలయంలోనీ తన ఛాంబర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ట్రాన్స్కో &జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు యస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి తో పాటు యన్ పి డి సి ఎల్ సి యం డి గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశం లో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికి సరఫరా లో అంతరాయం కలుగకుండా అందించాలని అధికారులను ఆదేశించారు.తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభించిన రోజు నుండి డిమాండ్ ప్రతి సంవత్సరం పెరుగుతుందన్నారు.కిందటి సంవత్సరం ఆగస్టు 30 నాటికి గరిష్టంగా 11,703 మేఘావాట్ల డిమాండ్ నమోదు అయిందని ఆయన తెలిపారు.ప్రస్తుత సీజన్ లో ఇప్పటి వరకు 11,500 మేఘావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయినప్పటికీ 13,000 మేఘావాట్ల డిమాండ్ వరకు పెరిగే అవకాశం ఉన్నందున ఎక్కడ కూడా సాంకేతికంగా ఆటంకాలు ఎదురు కాకుండా చూడాలన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ ను అందించి తెలంగాణ రైతాంగంలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు పడుతున్న శ్రమలో  విద్యుత్ సిబ్బంది బాగస్వామ్యం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.

Related Posts