YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

కరోనా వైరస్ పై కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం

కరోనా వైరస్ పై కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం

కరోనా వైరస్ పై కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం
అన్ని విమానాశ్రయాలలో థర్మల్, సింప్టోమాటిక్ స్క్రీనింగ్ లు
న్యూ ఢిల్లీ జనవరి 30 
దేశంలోని అన్ని రాష్ట్రాలూ,  21 విమానాశ్రయాలలో కరోనా వైరస్ కు సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ్ కుమార్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే వివిధ సలహాలు, మార్గదర్శకాలను జారీ చేసిందని, సంసిద్ధత స్థితిపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ అత్యున్నత స్థాయిలో ఉండాలని ఆయన కోరారు. నేపాల్ సరిహద్దులో ఉన్న రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.కరోనావైరస్ నివారణ, అదుపు కోసం వారి సంసిద్ధతను ఆయన సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో డిజిహెచ్ఎస్ డాక్టర్ రాజీవ్ గార్గ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఎన్‌సిడిసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విమానాశ్రయాలు – గుర్తించిన అన్ని విమానాశ్రయాలలో థర్మల్, సింప్టోమాటిక్ స్క్రీనింగ్ ప్రారంభించామని అన్ని రాష్ట్రాలూ తెలిపాయి. విమానాశ్రయాలలో ఇమ్మిగ్రేషన్, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశామని, విమానాశ్రయాలలో అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచామని తెలిపారు.డ్-ది-క్లాక్ సేవ కోసం మెడికల్ & పారా-మెడికల్ సిబ్బందిని మోహరించామని వారు వివరించారు. అన్ని విమానాశ్రయాలలో ప్రయాణీకులను అప్రమత్తం చేసేందుకు బోర్డులు కూడా ఏర్పాటు చేశామని వారు తెలిపారు. ఏడు కేంద్ర బృందాలు ఆయా రాష్ట్రాలను సందర్శించి తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తున్నారని సంజీవ్ కుమార్ తెలిపారు. నేపాల్ సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు ల్యాండ్ చెక్ పోస్టుల వద్ద తగిన చర్యలు తీసుకున్నాయని, సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలలో ప్రజలకు పరిస్థితి వివరించామని అధికారులు తెలిపారు.

Related Posts