YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎన్నికల కమిషన్ నాగిరెడ్డి రాజీనామా చేయాలి

ఎన్నికల కమిషన్ నాగిరెడ్డి రాజీనామా చేయాలి

ఎన్నికల కమిషన్ నాగిరెడ్డి రాజీనామా చేయాలి
       టిపిసిసి అధికార ప్రతినిధి నిరంజన్ డిమాండ్
హైదరాబాద్ జనవరి 30
ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ దే...కానీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలం అయ్యిందని టిపిసిసిఅధికార ప్రతినిధి నిరంజన్ అన్నారు.ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషనర్ పూర్తిగా పక్షపాతంగా వ్యవహరించారు. తన బాధ్యతలను విస్మరించారని ఆరోపించారు. వెంటనే ఎన్నికల కమిషన్ నాగిరెడ్డి రాజీనామా చేయాలని నిరంజన్ డిమాండ్ చేశారు.తాము ఎక్స్ అఫిషియో సభ్యుల సమాచారం అడిగితే చట్టం చూసుకోండి అంటూ నిర్లక్షంగా వ్యవహరించారు.ఒక జాతీయ రాజకేయ పార్టీగా తాము కలవడానికి వెళితే చాలా నిర్లక్షంగా వ్యవహరించారు.కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా రాజకీయ పార్టీలకు ఎంతో గౌరవం ఇచ్చారు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ చాలా నిర్లక్షంగా వ్యవహరించారు. దృతరాష్ట్ర పాత్ర పోషించారు.ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ఖర్చు చేసి ఓట్లు కొన్నారు. అన్ని పత్రికలో పెద్ద పెద్ద వార్తలు వచ్చిన కనీసం స్పందించలేదు.ఎన్నికలను ఎలా నడపాలో ఏ విదంగా జరపాలో ఎన్నికల కమిషన్ యే రూల్స్ పంపించింది..అవన్నీ అధికార పార్టీ దుర్వినియోగం చేసినా ఎలాంటి చర్యలు లేవు.మధిర లో 15వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చాడు. కానీ ఆయన 5 లక్షల చెక్ ఇచ్చాడు. ఆ చెక్ రియలైజ్ కాకముందే సర్టిఫికెట్ ఇచ్చారు.ఈ విషయంలో మేము ఫిర్యాదు చేసినా ఫలితం లేదు..25వ తేదీ రాత్రి 12 గంటలలోపు ఎక్సఫీషియో సభ్యుల పేర్లు ఇవ్వాలని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పేర్కొన్నారు. మేము తెల్లవారే వరకు సమయం ఇవ్వమన్న ఇవ్వలేదుకానీ టిఆర్ఎస్ ఇచ్చిన సభ్యుని మాత్రం 28వ తేదీన అవకాశం ఇవ్వడం ఏమిటి..
ఎన్నికల కమిషన్ కళ్ళుమూసుకొని పాలన చేస్తున్నదా..ఎక్స్ ఆఫీషియా సభ్యుల పేర్లు వెబ్సైట్ లో పెట్టాలని పార్టీ పరంగా కోరాము.అయిన పెట్టలేదు.కేవీపీ విషయంలో గందరగోళం చేశారు..ఇన్ని జరుగుతున్న తాము ఎన్నికల కమిషన్ ను కలవడానికి ప్రయత్నం చేస్తే కలవడానికి టైం ఇవ్వడం లేదు..ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించలేదు..సుభాష్ రెడ్డి తుక్కుగుడా లో కూడా  వోట్ వేశారు..ఎన్నికల కమిషన్ నాగిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలి.

Related Posts