దిశా చట్టం ఆవగాహనా ర్యాలీ
ఏలూరు, జనవరి 30,
స్త్రీలను గౌరవించడం మనదేశ సాంప్రదాయమని చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగికవేధింపులు జరుగకుండా ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యత తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె .వెంకటరమణా రెడ్ది చెప్పారు. మహిళాశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం స్దానిక ఇండోర్ స్టేడియంలో దిశచట్టం-2019 అవగాహనర్యాలీని జాయింట్ కలెక్టర్ శ్రీ కె . వెంకటరమణారెడ్ది జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, ప్రతి ఒక్కరూ మహిళాలను గౌరవించాలన్నారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, లైంగికదాడులను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టం అనే పేరుతో ఒక కొత్త చట్టాన్ని రూపొందించిందన్నారు. దేశంలోనే దిశ చట్టంచేసిన మొట్ట మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. నేరంచేసిన వారికి అతితక్కువ సమయంలోనే శిక్ష పడేలా ఈ చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలనే ఉద్దేశ్యంతో 3 వేల మందితో ర్యాలీ ఏర్పాటుచేశామన్నారు. ఈ చట్టం ప్రకారం అత్యాచారం జరిగిన 7 రోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తిచేసి, 14 రోజుల్లో విచారణ కూడా పూర్తిచేయాల్సి ఉందన్నారు. మొత్తం 21 రోజుల్లో ఈ చట్టం ప్రకారం నేరం రుజుపు అయిన నిందితునికి జీవితఖైదు లేదా మరణశిక్ష విధిస్తారని చెప్పారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యరమైన పోస్టులు పెడితే మొదటిసారి 2 సం .లు, రెండవసారి 4 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తారన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నారాల విచారణకు ప్రతిజిల్లాకు ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు ఏర్పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించుకునేందుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఎన్ని చట్టాలు వచ్చినా ప్రతివారిలో మహిళలపట్ల గౌరవభావం పెంపొందడం చాలా అవసరమన్నారు. తల్లిదండ్రులు కూడా తమపిల్లలకు చిన్నతనం నుండి నైతిక విలువలతో కూడా విద్యాబుద్దులు నేర్పించాలన్నారు. అప్పుడే ఆరోగ్యకరమైన సమసమాజం ఏర్పాటుతుందని జాయింట్ కలెక్టర్ శ్రీ కె . వెంకటరమణారెడ్ది చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ .2 నంబూరి తేజ్ భరత్, స్త్రీశిశు సంక్షేమశాఖ ఆర్ జెడి టి.వి . శ్రీనివాస్, ఐసిడిఎస్ పిడి విజయకుమారి, చైల్ద్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సూర్యచక్రవేణి, డిసిఒ టిఎస్ విశ్వనాధ్, సెట్‌వెల్ మేనేజర్ ప్రభాకరరావు, వరల్ద్ విజన్ మేనేజర్ శ్రీ జెమ్స్‌వాట్, సిడిపిఒ లు సునీల్ రాజశేఖర్ , తులసి, పి విజయలక్ష్మి, పి .పద్మావతి, కె . విజయలక్ష్మి, మెప్మా జిల్లా కోఆర్దినేటర్ సిహెచ్ మహాలక్ష్మి, నవసమాజ సొసైటీ చైర్మన్ నేతల రమేష్‌బాబు, సిఆర్ ఎఎఫ్ స్టేట్ ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీ ఫ్రాన్సిస్‌తంబి, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్ లో విద్యార్డినీ విద్యార్దులతో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ .2 శ్రీ నంబూరి తేజ్ భరత్ మావవహారంలోపాల్గొన్న వారితో ప్రతిజ్జ చేయించారు.