బాసరలో మంత్రి ఇంద్రకరణ్
బాసర జనవరి 30,
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు,అంతకు ముందు ఆలయ అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులకు ముధోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలసి,శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాలకు సీఎం కేసీఆర్ అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని త్వరలో బాసర ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 50 కోట్లు మంజూరు చేశారని మరో 50 కోట్లు మంజూరు చేయడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని అన్నారు.భక్తుల సౌకర్యార్థం ఆలయంలో త్రాగునీరు, మరుగుదొడ్లు,క్యూ లైన్ లు,అక్షరాబ్యాసం మండపాలు తీర్చిదిద్దుతామని అన్నారు.కేరళ రాష్ట్రం లాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి కొలువైన క్షేత్రంలో రాష్ట్ర విద్యా విధానంలో ముందు ఉంటుందని ప్రతి ఒక్కరూ 100% అక్షరాస్యతకు కృషి చేయాలని మంత్రి అన్నారు. రానున్న బడ్జెట్లో ఎక్కువ నిధులు మంజూరు చేసేందుకు కు దేవాదాయశాఖ మంత్రిగా అన్ని ఆలయాలను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని అన్నారు.