YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 సమత కేసులో నిందితులకు ఉరి శిక్ష విధింపు

 సమత కేసులో నిందితులకు ఉరి శిక్ష విధింపు

 సమత కేసులో నిందితులకు ఉరి శిక్ష విధింపు
అదిలాబాద్ జనవరి 30
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సమత హత్యాచార నిందితులు షేక్ బాబు, షేక్ షాబూద్దీన్, షేక్ మగ్దూం లకు అదిలాబాద్ ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విధించింది.  ఈ కేసులో ఈ నెల 27నే తీర్పు వెల్లడి కావాల్సి ఉండగా, న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవులో ఉండడంతో తీర్పును నేటికి వాయిదా వేసారు.  గురువారం ఈ కేసులో న్యాయస్థానం తుది తీర్పునిచ్చింది. పోలీసులు ఉదయాన్నే నిందితులను భారీ బందోబస్తు మద్య కోర్టుకు తరలించారు. ముగ్గురు దోషులకు ఉరిశిక్షను ఖరారు న్యాయస్థానం తీర్పునిచ్చింది. న్యాయమూర్తి ఉరిశిక్షను ఖరారు చేయగానే దోషులు షేక్ బాబు, షాబుద్దీన్, ముగ్దుమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మీరు చేసిన పని చాలా ఘోరమైనదని న్యాయమూర్తి ప్రియదర్శిని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.  అయితే తామే కుటుంబానికి ఆధారమని నిందితులు జడ్జి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. శిక్ష విషయంలో కనికరం చూపాలని నిందితులు వేడుకున్నారు. అయితే నిందితులు చేసిన నేరం చాలా ఘోరమైనదని చెబుతూ న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. నిందితుల తరపున వాదించేందుకు న్యాయవాదులెవరూ ముందుకు రాకపోవడంతో న్యాయ సేవాధికార సంస్థ తరఫున కోర్టు న్యాయవాదిని సమకూర్చింది. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకునే ఆమెపై ముగ్గురు మృగాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. దారుణంగా హత్యాచారం చేయడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.
కుమ్రం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్లో గత ఏడాది నవంబర్ 24న సమతపై అత్యాచారం జరిపి హత్య చేశారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తును 20 రోజుల్లో పూర్తి చేశారు. ఈ కేసు విచారణకు ఆదిలాబాద్ జిల్లా కోర్టులో ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. మొత్తం 44 మంది సాక్షులను విచారించారు. డిసెంబర్ 16నుంచి ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది. పోలీసులు డిసెంబర్ 14న 114 పేజీల ఛార్జిషీటు దాఖలు చేశారు. డిసెంబర్ 23నుంచి 31 వరకూ సాక్షుల విచారణ జరిగింది.   ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై సమత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Related Posts