Highlights
- శ్వాసకోశ బాధపటున్నారు
- పుకార్లను నమ్మవద్దు
- ఖండించిన కుటుంబ సభ్యులు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నకన్నడ సీనియర్ నటి జయంతి క్రమేణా కోలుకుంటున్నారని ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఆస్థమా, శ్వాసకోశ ఇబ్బందులతో మంగళవారం బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న జయంతి మంగళవారం రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూసినట్టు వార్తలు షికార్లు చేశాయి. ఈ వార్తలపై స్పందించిన జయంతి కుటుంబ సభ్యులు ఆమె నిక్షేపంలా ఉన్నారని, కోలుకుంటున్నారని తెలిపారు.