నవ్య కవితా పితామహుడు రాయప్రోలు సుబ్బారావు
భువనగిరి జనవరి 30
నవ్య కవితా పితామహుడు రాయప్రోలు సుబ్బారావు అని పలువురు వక్తలు కొనియాడారు.భారత బాష మంత్రిత్వశాఖ సహకారం తో విజన్ వాలెంటరీ ఆర్గనైజషన్ ఆద్వర్యం లో భువనగిరి లోనిస్టాండ్ ఫోర్డ్ మహిళా డిగ్రీ కాలేజీ లో రాయప్రోలు సుబ్బారావు పై సెమినార్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విజన్ వాలెంటరీ ఆర్గనైజషన్ అద్యక్షురాలు సి.రజిత అద్యక్షత వహించారు. జిహెచ్ఆర్ఏ నేషనల్ చర్మెన్ బాబు మిరియం ముఖ్య అతిధిగా, ఆతిధులుగా రాజేంద్ర కుమార్,సూర్యనారాయణ,ప్రమోద్ కుమార్,శ్రీనివాస్ రావు సుఖన్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూతెలుగులోభావకవిత్వానికిఆద్యుడు.ఈయన1892మార్చి17న జన్మించారని,1913లోఈయన రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు.ఇందులోఈయన అమలిన శృంగారతత్వాన్ని ఆవిష్కరించాడు.ప్రేమపెళ్ళికిదారితీయనియువతీయువకులుస్నేహితులుగామిగిలిపోవడానికినిర్ణయించుకున్నఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకుఅంకురార్పణ చేశాడన్నారు. అయితే రాయప్రోలుది గ్రుడ్డి అనుకరణ కాదు. తెలుగు, సంస్కృత భాషా పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. వ్యక్తిగతంగా మాత్రం కవిత్వంలో వ్రాసిన దేశభక్తికి ఫక్తు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి రాయప్రోలు.కళాకారుని ఊహలు,భావాలు,సృజనాత్మకతకుప్రాధాన్యమిచ్చేకళారూపంభావుకత.18వశతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్సు దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించాడన్నారు.అనంతరం పలువురిని సన్మానించారు.ఈ కార్యక్రమం లోమహిళా జాగృతి అద్యక్షురాలు ఆలం పల్లి లతా ,విజయ,విజయేందర్,లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.