భారత్‌లో కరోనా వైరస్ తొలి కేసు నమోదు
కేరళ జనవరి 30
భారత్‌లో కరోనా వైరస్ తొలి కేసు నమోదు అయ్యింది. చైనాలోని వుహాన్ నుంచి వచ్చిన ఓ విద్యార్థి.. కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ విద్యార్థి వుహాన్ వర్సిటీలో చదువుతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. హాస్పటల్లో ఆ విద్యార్థికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉన్నది. వైరస్ సోకిన వ్యక్తిని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు. చైనాలో కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు 170 మంది మృతిచెందారు. జనవరి 29వ తేదీ వరకు చైనా వ్యాప్తంగా సుమారు 8 వేల మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. కరోనా కేంద్ర బిందువైన హుబయ్ ప్రావిన్సులో ఇప్పటి వరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ద్రువీకరించింది. ప్రస్తుతం కనీసం 15 దేశాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి.