YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 జామియా మిలియా వర్శటీలో కాల్పులు

 జామియా మిలియా వర్శటీలో కాల్పులు

 జామియా మిలియా వర్శటీలో కాల్పులు
న్యూఢిల్లీ, జనవరి 30 
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ సమీపంలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి గాయపడ్డాడు. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు అలుముకున్నాయి. బ్లాక్ జాకెట్, వైట్ ప్యాంట్ ధరించిన ఓ వ్యక్తి రోడ్డు మీద నడుస్తూ.. తుపాకీ గాల్లోకి ఊపుతూ.. ‘మీకు స్వాతంత్య్రం ఇస్తా’ అని నిరసనకారులను ఉద్దేశించి అరవడాన్ని వీడియో తీశారు. సాయుధుడైన వ్యక్తిని జామియా మిలియా ఇస్లామియా విద్యార్థి షాదాబ్ ఆలంగా గుర్తించారని టైమ్స్ నౌ తెలిపింది. అతణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాల్పులు చోటు చేసుకోవడంతో ముందు జాగ్రత్తగా జామియా మసీదు, ఐటీఓ, ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్లు మూసివేశారు.అంతకు ముందు షాహిన్‌బాగ్‌లోనూ ఓ వ్యక్తి సీఏఏ ఆందోళనకారులకు తుపాకీ చూపి బెదిరించాడు. నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని అతడు సూచించాడు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించాడు.‘మేం హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ బయట బారికేడ్ల సమీపంలో కూర్చున్నాం. ఈ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి కాల్పులు జరిపాడు. అతడు కచ్చితంగా మాలో ఒకడు కాదు. బయటి వ్యక్తి’’ అని జామియా యూనివర్సిటీ విద్యార్థి అసిఫ్ తెలిపాడు. కాల్పుల్లో గాయపడిన వ్యక్తిని షాదాబ్‌గా గుర్తించారు. రక్తమోడుతున్న చేతితో ఉన్న అతణ్ని వెంటనే ఎయిమ్స్‌కు తరలించారు. గురువారం జామియా సమీపంలోని షాహీన్ బాగ్ వందలాది మంది మహిళలు ఆందోళనలు చేపట్టారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జామియా మిలియా నుంచి మహాత్మాగాంధీ స్మారకం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించాలని నిరసనకారులు భావించారు.

Related Posts