YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

నిర్భయ కేసులో దోషులకు షాకులు

నిర్భయ కేసులో దోషులకు షాకులు

నిర్భయ కేసులో దోషులకు షాకులు
న్యూఢిల్లీ, జనవరి 30 
నిర్భయ కేసులో దోషులకు సుప్రీం కోర్టులో వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే వినయ్ శర్మ, ముకేశ్ సింగ్ వేర్వేరుగా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను కొట్టివేసిన ధర్మాసనం.. తాజాగా అక్షయ్ థాకూర్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ఉరిశిక్ష అమలును వాయిదా వేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తులు ఎన్వీ రమణ, అరుణ్ మిశ్రా, నారీమన్, భానుమతి, అశోక్ భూషణ్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించిందిజనవరి 22నే నిర్భయ దోషులను ఉరి తీయాలని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. కానీ దోషులు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ వల్ల ఆరోజు ఉరి తీయడం కుదర్లేదు. తర్వాత ఫిబ్రవరి 1న ఉరి తీయాలంటూ మరోసారి డెత్ వారంట్ జారీ అయ్యింది. దీంతో ఉరి శిక్షపై స్టే విధించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.నిర్భయ దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించగా.. ఆయన తిరస్కరించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. అతడు సుప్రీంకు వెళ్లగా... న్యాయస్థానం ముకేశ్ పిటీషన్‌ను కొట్టివేసింది.

Related Posts