YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ముంబై, జనవరి  
దేశీ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల వల్ల గురువారం బెంచ్‌మార్క్ సూచీలు డీలా పడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ వంటి హెవీవెయిట్ షేర్లలో నష్టాలు కూడా మార్కెట్‌ను వెనక్కి లాగాయి. కరోనా వైరస్ వల్ల చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే అంచనాల వల్ల ఆసియా ఈక్విటీ మార్కెట్లు నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతిందని నిపుణులు పేర్కొంటున్నారు.
జనవరి ఎఫ్అండ్‌వో ఫ్యూచర్స్ ముగింపు కారణంగా ఇండెక్స్‌లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరకు సెన్సెక్స్ 285 పాయింట్ల నష్టంతో 40,914 పాయింట్ల వద్ద, నిఫ్టీ 94 పాయింట్ల నష్టంతో 12,036 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టపోయాయి.
 నిఫ్టీ 50లో బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఆటో దాదాపు 2 శాతం పరుగులు పెట్టింది.
 అదేసమయంలో యస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, హిందాల్కో, విప్రో షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ 5 శాతానికి పైగా పడిపోయింది.
 నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ ఫార్మా ఏకంగా 2 శాతానికి పైగా కుప్పకూలింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా నష్టపోయాయి.
 అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడవుతోంది. 26 పైసలు నష్టంతో 71.52 వద్ద కదలాడుతోంది.
 అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.85 శాతం తగ్గుదలతో 57.82 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.67 శాతం క్షీణతతో 52.44 డాలర్లకు తగ్గింది.

Related Posts