YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

ఆర్టీసీ బస్సులపై కేసీఆర్ బొమ్మలు  

ఆర్టీసీ బస్సులపై కేసీఆర్ బొమ్మలు  

ఆర్టీసీ బస్సులపై కేసీఆర్ బొమ్మలు  
హైద్రాబాద్, జనవరి 30 
ఆర్టీసీలో కార్గో సేవలకు వినియోగించనున్న అన్ని బస్సులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటాలను వేయించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. దీంతోపాటు ప్రయాణికుల భద్రత, సంస్థ ప్రగతికి సంబంధించిన సూక్తులను బస్సులపై ముద్రించనున్నట్లు ప్రకటించారు. గురువారం ఖైరతాబాద్‌ ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌ మొదటి అంతస్తులో కొత్తగా ఏర్పాటు చేసిన తన ఛాంబర్‌, కాన్ఫరెన్స్‌ హాలును మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఆర్టీసీని పూర్తిగా స్వతంత్రంగా ప్రగతి పథంలో నడిచేలా తీర్చి దిద్దుతున్నామని వెల్లడించారు. నష్టాలున్న డిపోలను అధికారులు దత్తత తీసుకుంటారని పేర్కొన్నారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు ఏటా పండుగ సందర్భంగా బోనస్‌‌లు ఇచ్చే స్థాయికి ఆర్టీసీని తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. అందుకే సరకు రవాణా (కార్గో) సేవలను ప్రారంభిస్తున్నామని, ఈ సేవలకు సీఎం కేసీఆరే బ్రాండ్‌ అంబాసిడర్‌ అని తెలిపారు. సంస్థలోని ఉద్యోగులను వేధించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంస్థలు వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులు ఎవరైనా తన నంబర్‌ 9849555778కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.సంస్థ నష్టాలకు కారణమవుతున్న రూట్లలో ప్రైవేటు వాహనాలను తిరగబోనివ్వబోమని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులు చేపట్టిన 55 రోజుల సమ్మె కాలపు వేతనాలను మార్చి 31 లోపు చెల్లిస్తామని తెలిపారు. రవాణా శాఖలో ఫ్యాన్సీ నంబర్ల రిజర్వేషన్‌ కోసం ‘ఈ-బిడ్డింగ్‌’ ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ‘ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌’ పద్ధతిలో వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం త్వరలో ‘పోర్టబిలిటీ’ సేవలను ప్రారంభిస్తామని పువ్వాడ ప్రకటించారు. 

Related Posts