YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్పార్పీకు మద్దతు ఇవ్వం : వైసీపీ

ఎన్పార్పీకు మద్దతు ఇవ్వం : వైసీపీ

ఎన్పార్పీకు మద్దతు ఇవ్వం : వైసీపీ
న్యూఢిల్లీ, జనవరి 30  
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), దేశ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)కు తాము వ్యతిరేకమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని గతంలో లోక్‌సభలోనే చెప్పినట్లు గురువారం (జనవరి 30) వైసీపీ లోక్‌సభా పక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి వెల్లడించారు. మైనారిటీ సోదరులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోరాడుతామని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో గురువారం వైసీపీ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కొన్ని అంశాలను లేవనెత్తారు. అఖిలపక్ష సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోమారు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ గ్రాంట్లను విడుదల చేయాలని కోరింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వైఎస్సార్‌‌సీపీ 9 అంశాలను లేవనెత్తింది.‘‘రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 18,969 కోట్ల బకాయిలు విడుదల చేయాలి. వెనకబడిన జిల్లాలకు రూ. 23 వేల కోట్లు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 3,283 కోట్లు కేంద్రం రీయింబర్స్‌మెంట్‌ చేయాలి. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55,548 కోట్లను ఆమోదించాలి. రాజధాని నగర అభివృద్ధి కోసం గ్రాంట్‌గా రూ. 47,424 కోట్లు ఇవ్వాలి. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలి’’ అని వైఎస్సార్‌ సీపీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

Related Posts