YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

వసంతపంచమి

వసంతపంచమి

వసంతపంచమి
మాఘ మాసంలో శుద్ధ పంచమి నాడు వచ్చే  పంచమినే వసంత పంచమి అంటారు. ఈ రోజు సరస్వతి దేవిని ఆరాధించడం వల్ల చదువు బాగా వస్తుంది. సర్వ విద్యలకు అధిదేవత అయిన ఈ దేవి సరస్వతి దేవి. ఈ వసంత పంచమి నీ  శ్రిపంచమి అని కూడా అంటారు.
 శిశిర ఋతువు లో వసంతుని స్వాగత చిహ్నంగా వసంత పంచమి వచ్చింది అనే కథ కూడా ప్రాచుర్యం లో కలదు. ఈ తల్లిని పంచమి రోజున తెల్లని పూలతో, తెల్లని వస్త్రం తో పూజ చేస్తారు. క్షీర అన్నని నైవేద్యం గా సమర్పించాలి.
దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.
 ఈ దేవి చేతిలో కుడి చేతిలో జపమాల, ఎడమ చేతి లో పుస్తకం, ఆభయ ముద్ర, వీణా నీ ధరించి ఉంటుంది. నిజానికి ఎడమ చేతిలో ఉన్న దానికంటే కుడి చేతి లో ఉన్న దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ దేవి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో పుస్తకం నీ ధరించి ఉన్నది. దాని లో అంతరార్థం కేవలం ఎప్పుడు పుస్తకాలని చదవకుండా , చదివిన విషయాన్నీ ఎప్పుడు స్మరణ చేస్తూ ఉండాలి అని అర్దం. 
నిజానికి కేవలం పిల్లలు మాత్రమే ఈ పూజ చేయండి అన్నడం తప్పు. విద్య అందరికీ కావాలి కావున అందరూ వసంత పంచమి రోజున చదువుల తల్లి  శ్రీసరస్వతీ దేవిని ఆరాధించాలి. 
పంచమి నాడు చదవవలసి శ్లోకం : 
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || 
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||

Related Posts