YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

ఇయూకు భారత్ వార్నింగ్..

ఇయూకు భారత్ వార్నింగ్..

ఇయూకు భారత్ వార్నింగ్..
న్యూఢిల్లీ, జనవరి 31,
దేశమంతటా సీఏఏ ఎన్నార్సీ విషయంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. కాదు అవన్నీ నిజాలు అని కేవలం ముస్లిం సంఘాలు, కాంగ్రెస్ మాత్రమే మాట్లాడుతున్నాయి. భారత ఆత్మకు జరుగుతున్న మోసాన్ని నిజమైన భారతీయుల హక్కులను కాపాడేందుకే దీనిని తెచ్చామని బీజేపీ సర్కారు అంటోంది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గేది లేదని చెబుతోంది. స్వయానా ప్రధాని మాట్లాడుతూ... కొన్ని కుటుంబాల వల్ల కశ్మీర్ చాలా అన్యాయానికి గురైందని సీఏఏతో అది సరిదిద్దబడుతుందని వ్యాఖ్యానించారు. దీంతో ఇక సీఏఏ ఎవరూ ఆపరేరు అనే విషయం అర్థమవుతోంది.ఇదిలా ఉండగా... భారత ప్రభుత్వ అంతర్గత వ్యవహారమైన దీనిలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసిన ఈయూ (యూరోపియన్ యూనియన్) కు తాజాగా జ్జానోదయం అయ్యింది. దీనిపై తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ పెడదాం అనుకున్నారు. ఇది ముస్లింలపై వివక్షగా పేర్కొంది. దీనిని భారత్ ఖండిస్తూ అది మా అంతర్గత వ్యవహారం అని స్పష్టం చేసింది. ఇందులో అంతర్జాతీయ జోక్యానికి ఆస్కారం లేదని పేర్కొంది. భారత దౌత్య విభాగం గట్టిగా తన వాదన వినిపించడంతో సీఏఏని పక్కన పెట్టాలని ఐరోపా దేశాల సమాఖ్య భావించింది. దీంతో దౌత్య పరంగా భారత్ పెద్ద విజయాన్ని నమోదు చేసినట్లు అనుకోవాలి.  

Related Posts