YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జక్కేపల్లి లో గెలుపెవరిదో....?

జక్కేపల్లి లో గెలుపెవరిదో....?

పోటాపోటీగా ప్రచారం

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ని కూసుమంచి మండలం జక్కేపల్లి ప్రాదేశిక నియోజకవర్గ ఉప ఎన్నిక ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది

సహజంగా ఎన్నికలంటేనే కొంత వాతావరణం వేడెక్కుతుంది అందులోనూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోంత నియోజకవర్గం కావడం  సార్వత్రిక ఎన్నికలకు సంవత్సర కాలమే ఉండటంతో ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది

ఇక్కడ కాంగ్రెస్ తరపున గెలిచిన యంపిటిసి బుజ్జి ఇటీవల మృతి చెందడంతో ఈ నెల 11న ఉప ఎన్నికను నిర్వహిస్తున్నారు

జక్కేపల్లి యంపిటిసి పరిధిలో మొత్తం ఓట్లు 2,280 కాగా అందులో జక్కేపల్లి లో 1307 ఓట్లు మల్లేపల్లి లో 973 ఓట్లున్నాయి

ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన కాంగ్రెస్ టిడిపి అభ్యర్థులు ఉపేంద్రమ్మ సక్కు లను అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల బరిలో నుంచి తప్పించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా అలాంటిదేమీలేదు అభివృద్ధిని చూసి తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారని టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు అయితే నామినేషన్లు వేసే ముందు వారికి అభివృద్ధి కనపడలేదా అనేది పలువురి ప్రశ్న

తమ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహారించుకోవడంతో కంగుతిన్న ఆయా పార్టీల నాయకులు సిపిఎం అభ్యర్థి భూక్యా భారతి కి మద్దతు తెలిపారు కాగా టిఆర్ఎస్ ఒంటరిగానే పోటీకి దిగింది

ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరుపార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు జిల్లా మండల స్థాయి నాయకులు ప్రాదేశిక నియోజకవర్గ పరిధిలోని జక్కేపల్లి మల్లేపల్లి గ్రామాల్లో మకాం వేసి ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్నారు 

టిఆర్ఎస్ మంత్రి తుమ్మల చేసిన అభివృద్ధినే ప్రదానస్రంగా ప్రచారం నిర్వహిస్తుండగా  ప్రభుత్వ వైపల్యాలు ప్రజాసమస్యలే ప్రదాన ఎజెండా సిపిఎం ప్రచారం నిర్వహిస్తుంది

గెలుపే లక్ష్యంగా పావులు కదుపున్న టిఆర్ఎస్ - సిపిఎం పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి

మంత్రి ఇలాకాలో టిఆర్ఎస్ ని ఓడించి ఆపార్టీ ఆత్మదైర్యాన్ని దెబ్బకొట్టం తోపాటు కారు స్పీడ్ కు బ్రేకులు వేసేందుకు ప్రతిపక్ష పార్టీలు వ్వూహరచనచేస్తున్నాయి

ఏదిఏమైనప్పటికీ జక్కేపల్లి యంపిటిసి ఉప ఎన్నికల్లో విజయం సాధించడం తుమ్మల కు ప్రతిష్టాత్మకంగా మారింది సోంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ టిఆర్ఎస్ ఓటమి పాలైతే ఆ సందేశం చాలా దూరం వెళ్ళుతుంది

ఈ ఎన్నికల్లో గెలుపెవరిని వరించనుందో వేసి చూడాల్సిందే

Related Posts