ఆందోళనలో రియల్టర్ కుటుంబం
పట్టపగలు హైదరాబాదులో ఓ రియల్టర్ అపహరణకు గురయ్యారు. కూరగాయలకు వెళ్లి వస్తున్న అనంతయ్య(68) అనే రియల్టర్‌ను నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి కారులో తీసుకుని వెళ్లారు. వనస్థలిపురం లోని చైతన్య నగర్ లో కిడ్నాప్ కలకలం చెలరేగింది. అనంతయ్య గతంలో నల్లగొండ జిల్లాలో ఓ గ్రామానికి సర్పంచ్‌గా కూడా పనిచేశారు. కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది తెలియడం లేదు. తమకు ఎవరూ శత్రువులు లేరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.కిడ్నాపర్లను పట్టుకోవడానికి పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. కిడ్నాపర్లు ఎవరనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అంటున్నారు.
అంతయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారిని కారులో వచ్చి కిడ్నాప్ చేసిన నలుగురు గుర్తుతేలియని దుండగులు,కిడ్నాప్ కి రియల్ ఎస్టేట్ వ్యాపారమే కారణమని అనుమానం, ps లో బంధువుల పిర్యాదు, కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీస్ లు.అంతయ్య దేవరకొండ మాజీ సర్పంచ్.