Highlights
- మే12 కన్నడ అసెంబ్లీ ఎన్నికలు
- యువ ఓటర్లల్లో స్ఫూర్తినింపనున్న రాహుల్ ద్రవిడ్
- లను నియమించిన ఎన్నికల కమిషన్
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను ఎన్నికల సంఘం ‘స్టేట్ ఎలక్షన్ ఐకాన్’గా ప్రకటించింది. ఈ విషయాన్ని చీఫ్ ఎలక్టోరల్ అధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. మంగళవారం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మే 12న సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు నిర్వహించనుండగా, 15న ఓట్ల లెక్కిస్తారు. కాగా, ‘ఎలక్షన్ ఐకాన్’గా ఎన్నికైన రాహుల్ ద్రవిడ్ యువ ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.కర్ణాటకలో మే 12 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ్ యువ ఓటర్లల్లో చైతన్యం తీసుకురానున్నారు. ఇక పక్క ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తు వేస్తూ.. తమదైన శైలిలో అధికార పగ్గాలను చేపట్టేందుకు తలమునకలవుతున్నారు. మరో పక్క రాష్ట్ర ఎన్నికల ఎన్నికల కోసం ఓ టైటిల్ సాంగ్ రూపొందించే పనిలో పడింది. సంగీత దర్శకుడు యోగరాజ్ భట్ సారధ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈసాంగ్ ని మరో వారంలో విడుదల చేసేందుకు సంనర్ధమవుతున్నారు. దివ్యాంగులైన కొందరు ప్రభుత్వ ఉద్యోగులను తొలిసారి పోలింగ్ స్టేటషన్లలో పోలింగ్ సిబ్బందిగా నియమించనున్నట్టు సంజీవ్ కుమార్ తెలిపారు.