YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పాలనా పరమైన సౌలభ్యం కోసం మంత్రుల శాఖలు మార్పు!

పాలనా పరమైన సౌలభ్యం కోసం మంత్రుల శాఖలు మార్పు!

పాలనా పరమైన సౌలభ్యం కోసం మంత్రుల శాఖలు మార్పు!
అమరావతి జనవరి 31 
పాలనా పరమైన మార్పుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అనవసరమైన చర్చలు.. సమీక్షల పేరుతో కాలయాపన చేయకుండా.. చేయాల్సిన పనుల్ని చేసుకుంటూ పోవటం జగన్ కున్న అలవాటు. తాజాగా అలాంటి పనే చేపట్టారు సీఎం జగన్. కొందరు మంత్రుల ఫోర్టుపోలియోలు వేర్వేరుగా ఉన్న నేపథ్యంలో.. పాలనా పరమైన సౌలభ్యం కోసం ఇద్దరు మంత్రుల వద్ద ఉన్న శాఖల్ని ఒకే మంత్రి వద్దకు చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు.మంత్రి మోపిదేవి వద్దనున్న మార్కెటింగ్ శాఖ..మరో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వద్ద ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను ఇంకో మంత్రి కన్నబాబుకు అప్పగించారు. ఆయన వద్ద ఇప్పటికే వ్యవసాయ.. సహకార శాఖల్ని పర్యవేక్షిస్తున్నారు. పాలనా పరమైన సౌలభ్యం తో పాటు.. మరింత మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ చర్యల్ని చేపట్టినట్లుగా చెబుతున్నారు. మోపిదేవి.. మేకపాటి వద్దనున్న శాఖల్ని తీసి.. కన్నబాబుకు అప్పగించిన నేపథ్యంలో.. వారిద్దరికి వేర్వేరు శాఖలు అప్పగించాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ శాఖను మంత్రి గౌతం రెడ్డి కి ఇటీవల అప్పగించిన వైనం తెలిసిందే. పాలనా పరమైన విషయాల్లో మార్పులు చేయాల్సి వస్తే.. అనవసరమైన శషబిషలు పక్కన పెట్టేసి.. వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ వైఖరిని పలువురు అభినందిస్తున్నారు.

Related Posts