కరోనా వెనుక కుతంత్రం కథనాలు
హైద్రాబాద్, జనవరి 31
కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి చైనాయే అసలు కారణమా? ఆ దేశం చేస్తున్న కుతంత్రం బెడిసికొట్టిందా? అంటే అవునంటున్నాడో నిపుణుడు. ఓ వార్తా సంస్థ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. మరి చైనా చేసిన కుతంత్రం ఏంటంటే.. బయో ఆయుధం తయారు చేయడమే అని అంటున్నాడు ఇజ్రాయెల్‌కు చెందిన ఆ నిపుణుడు. వాస్తవానికి కరోనా వైరస్ ఎలా పుట్టింది? ఎలా బయటికి వచ్చింది? అనే ప్రశ్నలు ఇంకా తలెత్తుతూనే ఉన్నాయి. ఓ మాంస విక్రయశాల నుంచి వచ్చిందని, పాముల నుంచి సోకిందని, గబ్బిలాల వల్లే వ్యాప్తి చెందిందని.. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, కచ్చితమైన ఆధారం దొరకలేదు. ఆ లోగానే వందల మందిని బలి తీసుకుంటోంది. ఇప్పటికే ఆ దేశంలో 132 మంది మృత్యువాతపడ్డారు.ఇజ్రాయెల్‌కు చెందిన బయోలాజికల్ వార్‌ఫేర్ ఎక్స్‌పర్ట్ డేనీ షోహామ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఏ నగరం నుంచైతే కరోనా వ్యాప్తి చెందిందో ఆ చోటే చైనా బయో వెపన్స్ తయారు చేస్తోంది. ఆ నగరమే.. వుహాన్. అక్కడి నుంచే ఈ వైరస్ ప్రపంచానికి పాకుతోంది. ఆ నగరంలో వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనే ల్యాబ్ ఉంది. అక్కడ వైరస్‌లపై పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. సార్స్, ఇతర వైరస్‌ల నమూనాలు ఇక్కడ భద్రపరిచారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రిఫరెన్స్‌గా ఇది పనిచేస్తుంది. అయితే, చైనా దీన్ని స్వప్రయోజనాలు పొందేందుకు వాడుతోందని ఆ నిపుణుడు తెలిపాడు. ఎబోలా, నిఫా, సార్స్ వంటి ప్రాణాంతక వైరస్‌లు ఇక్కడ భద్రపరిచారని చెప్పాడు. ఆ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ను అభివృద్ధి చేశారని, అయితే.. ప్రమాదవశాత్తు ఆ వైరస్ బయటికి వచ్చి ఆ దేశాన్నే కాటేసిందని కూడా ఆయన స్పష్టం చేశాడు.ఆయనే కాదు.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన కూడా గందరగోళంగా ఉందని అంటోంది చైనాకే చెందిన జీ న్యూస్ ఛానెల్. గతంలో చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుమార్లు వార్తలు రాసిన ఈ ఛానల్ కరోనాపైనా చైనా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసింది. జిన్‌పింగ్ ఏదో దాస్తున్నారని, బయో వెపన్‌పై తొందరలోనే నిజాన్ని బయటపెడతారని వ్యాఖ్యానించింది.బయో వెపన్ అంటే ఏంటంటే.. కొత్త వైరస్‌ను సృష్టించి, దాంతో వ్యాధులను వ్యాప్తి చేయడం. ఉదాహారణకు.. ఒక దేశం మరో దేశంతో యుద్ధం చేయాల్సి వస్తే ఆ దేశం నేరుగా యుద్ధ రంగంలోకి దూకకుండా, బయో వెపన్‌ను వాడుతుంది. వివరంగా చెప్పాలంటే.. ఒక వ్యక్తిలోకి వైరస్‌ను ఎక్కించి శత్రుదేశంలోకి పంపిస్తారు. ఆ వైరస్ శత్రుదేశంలోని ప్రజలకు సోకి వ్యాధిబారిన పడేస్తుంది. దాంతో ఆ శత్రుదేశం ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా బలహీనపడిపోతుంది. తద్వారా యుద్ధం చేయలేని స్థితిలో లొంగిపోతుంది. ఇదీ.. బయో వెపన్ తయారు చేయడానికి అసలు కారణం.