YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విద్య-ఉపాధి తెలంగాణ

రెండు కాలేజీలకు బిగుస్తున్న ఉచ్చు.. విస్తుగొలిపే నిజాలు

రెండు కాలేజీలకు బిగుస్తున్న ఉచ్చు.. విస్తుగొలిపే నిజాలు

 రెండు కాలేజీలకు బిగుస్తున్న ఉచ్చు.. విస్తుగొలిపే నిజాలు
హైద్రాబాద్, జనవరి 31  
 ఈ కాలేజీల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఎంసెట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని సీఐడీ అధికారులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. రెండు ప్రముఖ కాలేజీల్లో పనిచేసే కొంత మంది ఉద్యోగులు ఎంసెట్ పేపర్ లీకేజీలో సూత్రధారులుగా ఉన్నారని సీఐడీ వేసిన ఛార్జిషీట్లో పేర్కొంది.2016లో సంచలనం రేపిన తెలంగాణ ఎంసెట్ కుంభకోణం కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఇందులో రెండు ప్రముఖ కాలేజీలకు ఉచ్చు బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కాలేజీల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఎంసెట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని సీఐడీ అధికారులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. రెండు ప్రముఖ కాలేజీల్లో పనిచేసే కొంత మంది ఉద్యోగులు ఎంసెట్ పేపర్ లీకేజీలో సూత్రధారులుగా ఉన్నారని సీఐడీ వేసిన ఛార్జిషీట్లో పేర్కొంది.2016లో జరిగిన ఎంసెట్ స్కాంలో సీఐడీ దర్యాప్తు పూర్తి చేసి, నాంపల్లి కోర్టులో ఛార్జిషీటు కూడా దాఖలు చేసింది. నాలుగు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత పూర్తి ఆధారాలతో చార్జిషీటు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 90 మంది నిందితులను చేర్చింది. ఇందులో ముగ్గురు నిందితులు చనిపోయారని ఒకరు అనుమానాస్పదస్థితిలో చనిపోగా మరో ఇద్దరు సహజ మరణం పొందారు. కమలేష్, జితేందర్, రావత్ ముగ్గురు నిందితులు చనిపోయారు.64 మంది నిందితులను అరెస్టు చేసి సీఐడీ రిమాండ్‌కు తరలించింది. ఈ కేసులో ఇంకా 23 మంది నిందితులు పరారీలో ఉన్నట్లుగా సీఐడీ పేర్కొంది. ర్యాంకుల కోసం ఆ రెండు కాలేజీలు దొడ్డి దారిన పేపర్ తీసుకుని వచ్చారని ఆరోపించింది. ఈ కళాశాలలకు చెందిన 9 మంది సిబ్బందిని కూడా సీఐడీ ఇప్పటికే అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే నాంపల్లి కోర్టు ట్రయల్స్‌ను ప్రారంభించనుంది.
 

Related Posts