YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పరోక్ష ఎన్నికల్లోనూ డీఎంకేకు షాక్‌

పరోక్ష ఎన్నికల్లోనూ డీఎంకేకు షాక్‌

పరోక్ష ఎన్నికల్లోనూ డీఎంకేకు షాక్‌
అత్యధిక పదవులను కైవసం చేసుకున్న అన్నాడీఎంకే
              కనిమొళి రాస్తారోకో
చెన్నై జనవరి 31 
;: వివిధ కారణాల వల్ల వాయిదాపడిన యూనియన్‌ పంచాయతీ, గ్రామపంచాయతీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 335 పదవులకుగాను జరిగిన ఈ పరోక్ష ఎన్నికల్లోనూ అధికార అన్నాడీఎంకే అత్యధిక పదవులను కైవసం చేసుకుంది. ఇక తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి యూనియన్‌ అధ్యక్ష పదవికి జరిగిన పరోక్ష ఎన్నికల్లో మెజారిటీ లేని అన్నాడీఎంకే అభ్యర్థిని గెలిచినట్టు ప్రకటించడంపై డీఎంకే కూటమి కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకుని డీఎంకే ఎంపీ కనిమొళి, శాసనసభ్యురాలు గీతాజీవన్‌ హుటాహుటిన అక్కడికి చేరుకుని కార్యకర్తలతో కలసి రోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత గత డిసెంబర్‌లో రెండు విడతలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్‌, మునిసిపాలిటీల ఎన్నికలు మినహా గ్రామపం చాయ తీలు, యూనియన్‌ పంచాయతీలు, జిల్లా పరిషత్‌ సభ్యుల పదవులకు డిసెంబర్‌ 27, 30 తేదీలలో జరిగాయి. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే కంటే డీఎంకే అధిక స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత ఎన్నికైన వార్డు సభ్యులంతా ఈనెల 6న అధ్యక్షులు, ఉపాధ్య క్షులు, జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నికలు జరిగాయి. ఆయా గ్రామపంచాయతీలు, యూనియన్‌ పంచాయితీలు, జిల్లా పరిషత్‌ సమా వేశాలు నిర్వహించి అధ్యక్షులు, ఉపాధ్యక్షులను వార్డు సభ్యులంతా కలిసి ఎన్నుకున్నారు. ఆ సందర్భంగా సమావే శాలకు తగిన కోరం లేక పోవడం (50 శాతం కంటే తక్కువ సభ్యులు హాజరుకావటం) పలుచోట్ల అన్నా డీఎంకే, డీఎంకే వర్గాలు గొడవకు దిగటం, కొన్ని చోట్ల ఎన్నికల నిర్వహణ అధికారులు అనారోగ్యం తదితర కారణాల వల్ల రాలేకపోవడం వంటి కారణాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 335 పదవులకు పరోక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ ఎన్నికలు గురువారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రశాంతంగా జరిగాయి. ఓ జిల్లా పరిషత్‌ కమిటీ అధ్యక్ష పదవికి, ఉపాధ్యక్ష పదవికి, 266 గ్రామపంచాయతీ ఉప సర్పంచ్‌ పదవులకు, 26 యూనియన్‌ పంచాయతీ అధ్యక్ష పదవులకు ఈ ఎన్నికలు జరిగాయి. వార్డు సభ్యులు, కౌన్సిలర్లు సమావేశమై అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే అత్యధిక పదవులను కైవసం చేసుకుంది. పళ్ళిపట్టు యూనియన్‌ ఛైర్మన్‌గా అన్నాడీఎంకే అభ్యర్థి జాన్సీరాణి, నామక్కల్‌ యూని యన్‌ ఛైర్మన్‌గా అన్నాడీఎంకే అభ్యర్థి తిలకవతి, కడలూరు జిల్లా నల్లూరు యూనియన్‌ అధ్యక్షుడి డీఎంకే అభ్యర్థి నల్లకన్ను ఎన్నికయ్యారు. విరుదునగర్‌ జిల్లా వత్తిరాయిరుప్పు యూనియన్‌ అధ్యక్షుడిగా అన్నా డీఎంకే సభ్యుడు సింధు మురుగన్‌, తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి యూనియన్‌ అధ్యక్షుడిగా అన్నాడీఎంకే అభ్యర్థి, తంజావూరు జిల్లా పేరావుర్ని అధ్యక్షురాలిగా అన్నాడీఎంకే అభ్యర్థి శశికళ గెలిచారు. సేలం జిల్లా తారామంగళం యూనియన్‌ అధ్యక్షుడిగా పీఎంకే అభ్యర్థి సుమతి గెలిచారు.
కోవిల్‌పట్టిలో అన్నాడీఎంకే గెలుపు- డీఎంకే ధర్నా
ఇదిలా వుండగా, తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి యూనియన్‌ పంచాయతీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి కస్తూరి గెలిచినట్టు అధి కారులు ప్రకటించారు. ఆ యూనియన్‌లో అన్నా డీఎం కే కూటమిలో 9 మంది సభ్యులు, డీఎంకే కూటమిలో 10 మంది సభ్యులు ఉన్నారు. డీఎంకే అభ్యర్థి పూమారి తప్పకుండా అధ్యక్ష పదవిని గెలుచుకుంటారని అం దరూ భావించారు. అయితే ఊహించని విధంగా పది ఓట్లతో అన్నాడీఎంకే అభ్యర్థి కస్తూరి గెలిచినట్టు అధికారులు ప్రకటించడంతో డీఎంకే కూటమి కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్‌ కార్యా లయం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకుని డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళి, శాసనసభ్యురాలు గీతా జీవన్‌ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కనిమొళి ఎన్నికల అధికారి ఉమాశంకర్‌ వద్దకు వెళ్ళి డీఎంకే అభ్యర్థికి 10 మంది సభ్యులు మద్దతు ఉన్నప్పుడు 9మంది సభ్యులు మాత్రమే కలిగిన అన్నాడీఎంకే అభ్యర్థిని గెలిచినట్లు ఎలా ప్రకటించారని వాగ్వాదానికి దిగారు. అయితే ఎన్నికల అధికారి పది ఓట్లు పడ టంతో అన్నాడీఎంకే అభ్యర్థి గెలిచారని, ఇందులో ఎలాంటి అవకతవకలు జరుగలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత కనిమొళి, గీతాజీవన్‌ డీఎంకే కౌన్సిలర్లు, కార్యకర్తలు రహదారిపై భైఠాయించి రాస్తారోకోకు దిగారు. దీనితో ఆ ప్రాంతం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఆందోళనలో పాల్గొన్న కనిమొళి మీడియాతో మాట్లాడుతూ, మంత్రి కడంబూరు రాజు గత మూడు రోజులుగా కోవిల్‌పట్టి యూనియన్‌ అధ్యక్ష పదవిని అన్నాడీఎంకే గెలుచు కుంటూ చెబుతూ వచ్చారని, ఆ కారణం వల్లే ఎన్నికల అధికారి అన్నాడీఎంకే అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారని ఆరోపించారు. యూనియన్‌ పంచాయతీలో 10 మంది కౌన్సిలర్లు వున్నప్పటికీ అక్రమ పద్ధతిలో అన్నాడీఎంకే అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని పేర్కొన్నారు. ఈ ఎన్నికను రద్దు చేసి సక్రమంగా ఎన్నికలు జరపాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Related Posts