మావోయిస్ట్ కేంద్ర కమిటీలో సంస్థాగత మార్పులు
హైదరాబాద్ జనవరి 31
నిషేధిత మావోయిస్ట్ పార్టీ కేంద్రకమిటీ లో భారీ స్థాయిలో మార్పులు జరిగాయని వార్తలు వచ్చాయి. కార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్ దేవరాజ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కావడంతో కేంద్ర కమిటీలో భారీ ప్రక్షాళన జరిగినట్లు సమాచారం. 21 మంది సభ్యులతో నూతన కేంద్రకమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీలో తెలంగాణా కు చెందిన పది మంది, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు, ఝార్ఖండ్ నుండి నలుగురు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ నుండి ఇద్దరిద్దరు, బీహార్ నుండి ఒకరికి అవకాశం లభించింది అగ్ర స్థానంలో వున్న నంబాల కేశవరావు, అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్ కే కాకుండా తెలంగాణ కు చెందిన పదిమందికి చోటు దక్కింది. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, కరీంనగర్. మాల్లోజుల వేణుగోపాల్ అలియాస్ వివేక్, కరీంనగర్. కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, ఆదిలాబాద్. మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, కరీంనగర్. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, కరీంనగర్. కడారి సత్యనారాయణ అలియాస్ కోసా, కరీంనగర్. మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ , హైదరాబాద్. పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న, కరీంనగర్. గాజర్ల రవి అలియాస్ గణేష్, వరంగల్. పాక హనుమంతు అలియాస్ ఉకే గణేష్, నల్గొండ లకు కేంద్ర కమిటీలో చోటు దక్కింది.