YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 కరోనాపై అప్రమత్తం

 కరోనాపై అప్రమత్తం

 కరోనాపై అప్రమత్తం
విశాఖపట్నం జనవరి 31
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్,  ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించింది.దేశంలో మొట్టమొదటి సారిగా కేసు నమోదైనట్లు భారత వైద్య శాఖ దృవీకరించింది.దీంతో కరోనా వైరస్ ఇప్పుడు ఈ మాట వింటేనే తెలుగు ప్రజలు వణికిపోతున్నారు. చైనాను గడగడలాడిస్తున్న ఈ వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతుందా అనే ఆందోళన ఇప్పుడు అందర్నీ కలవరపెడుతోంది.  పర్యాటక, వ్యాపార వాణిజ్య పరంగా విశాఖకు వచ్చే వాళ్లపై జిల్లా అధికారులు దృష్టి పెడుతున్నారు. దీంతో ఎయిర్ పోర్టులో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి ప్రయాణీకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , ఇటు వైద్య నిపుణులు అటు ప్రభుత్వాలు విస్త్తత స్ధాయిలో ప్రచారం చేస్తున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రాణాంతక వైరస్‌ విజృంభిస్తున్న ఈ వైరస్ తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందకుండా ముందస్తుగా వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌పై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో విశాఖలో వైద్య శాఖ అలెర్ట్ అయ్యింది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తం చేస్తూ దేశ,విదేశాల నుంచి నగరానికి వచ్చే పర్యాటకులకు వైరస్‌పై అవగాహన కలిగించే చర్యలను చేపట్టింది. ఎయిర్‌పోర్టు ఆవరణలో వైరస్‌ పట్ల అవగాహన కలిగించేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అందులో వైరస్‌ లక్షణాలు, దాని బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలను పేర్కొంది. ముఖ్యంగా జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్.. క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. దీంతో అన్ని ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపడుతున్నారు. విశాఖ అంటేనే పర్యాటకంగా ప్రసిద్ది చెందిన ప్రాంతం కావడంతో అధిక శాతం ఇతర దేశాలకు చెందిన పర్యాటకులు వస్తుంటారు. ఈ క్రమంలో వారికి ఈ వ్యాధి ఎయిర్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం వ్యాధి తీవ్రత పెరగకుండా ఉండేలా జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో వీటి ఛాయలు కనిపిస్తాయా అనే భయంతో ప్రజలు వణికిపోతున్నారు. రోజు రోజుకి కరోనా వైరస్ భయం పెరిగిపోతోంది. శరవేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు వంటి వ్యాధులు సోకి క్రమంగా మనిషిని చావు వరకు తీసుకెళ్తాయి. విశాఖలో ఆర్కేబీచ్,రద్దీగా ఉండే ప్రాంతాలైన జగదాంబ ,ఆర్టీకీ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ప్రజల సంచారం ఉంటుంది కాబట్టి...ఆ ప్రాంతాల్లో తిరిగే వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ పై  అవగాహన,  ప్రచారం అవసరమంటున్నారు వైద్యులు. జిల్లాలో కరోనా వైరస్ ని గుర్తించడానికి పలుచోట్ల ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో విశాఖకు పాకిన స్వైన్ ఫ్లూ మహమ్మారి తరహాలో ఈ కరోనా వైరస్ కూడా విజృభిస్తుందా అనే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related Posts