ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు చదువు
రంగారెడ్డి జనవరి 31 (న్యూస్ పల్స్)
రంగారెడ్డి జిల్లా ఆది బట్ల మున్సిపాలిటీ పరిధిలో కొంగరా కలాన్ లో ఇటుక బట్టి వలస కార్మికుల బాల బాలికల పాఠశాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు బ్యాగులు, బుక్స్ పంపిణీ చేసారు. సీపీ మాట్లాడుతూ గత నాలుగు ఏండ్ల క్రితం ఇలాంగి పాఠశాలలను ప్రాంభించాము. ఎన్జీవోస్ నుండి సహకారం తో పాఠశాల లను ఓపెన్ చేశాము. ఎమ్మెల్యే సహకారం ఉంది. 2100 మంది కి చదువు నేర్పించామని అన్నారు. మధ్యాహన్న భోజనం కూడా పెట్టడం శుభపరిణామం. దేశం లో ఎక్కడ ఈ లాంటి ప్రాజెక్టు లు లేవు. ఇక్కడ చేయడం సంతోషించదగ్గ విషయం. అమెరికా లాంటి దేశంలో మంచి పేరు వచ్చింది. ఈ ఏడు700 మందికి చదువు చేబుతున్నాం. ఓడియా బాష నుండి పుస్తకాలు తెప్పిస్తున్నాం. వలస కార్మికులు గతంలో బట్టిల పైన రైడ్స్ చేసి కేసులు చేసేవాళ్లం. కానీ దానివలన ఉపయోగాలు లేవు. ముందు వలస కార్మికులు కోసం ప్రత్యేకంగా చదువు చూపించడం కోసం కృషి చేసినందుకు అందరికి ధన్యవాదాలని అన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సహకారంతో యాజమాన్యాలు సహకారంతో చదువు కోసం ప్రయత్నం చేయడం శుభపరిణామం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోఉన్న పిల్లలందరుకి చదువు కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. లేబర్ కార్మికులకు ఇన్సురెన్సు వచ్చేవిదంగా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరారు.