YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతి రైతులకు వైకాపా ఎంపీ మద్దతు

అమరావతి రైతులకు వైకాపా ఎంపీ మద్దతు

అమరావతి రైతులకు వైకాపా ఎంపీ మద్దతు
అమరావతి  జనవరి 31 
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు నరసరావుపేట వైకాపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు మద్దతు తెలిపారు. మందడం, వెలగపూడిలో దీక్షా శిబిరాలకు విచ్చేసిన ఎంపీ రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు వచ్చి మీ అభిప్రాయాలు చెప్పాలని రైతులకు సూచించారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఆందోళన చేస్తున్న రైతులు ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. సానుకూలంగా సమస్యను పరిష్కరించుకుందామని కోరారు.

Related Posts