ప్రతి విద్యార్థికి నులిపురుగు మాత్రలు వేయాలి
జిల్లా రెవెన్యూ అధికారిని అరుణ శ్రీ
జగిత్యాల జనవరి 31
జిల్లాలోని ప్రతి విద్యార్థికి నులిపురుగు మాత్రలు
వేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారిని అరుణ శ్రీ అన్నారు. శుక్రవారం స్థానిక ఐ.ఎమ్ఏహాల్లో జగిత్యాల డివిజన్ వైద్యాధికారులు, మండల విద్యాధికారులు, ఐసిడిఎస్ సిడిపిఓలు,సూపర్వైజర్లు ఆరోగ్య పర్యవేక్షకులతో జరిగిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిని అరుణ శ్రీ పాల్గొన్నారు. ఫిబ్రవరి 10 న జరిగే నులిపురుగుల నివరణ కార్యక్రమంలో 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు ఆల్బెన్దజోల్ మాత్రలు అందేలా ఆరోగ్య శాఖ, విద్యా శాఖ మరియు శిశు సంక్షేమశాఖ పూర్తి సహకారం అందించి కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం నులిపురుగుల నివారణకు కరపత్రాన్ని ఆవిష్కరించారు.ఆనంతరం ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ మాట్లాడుతూ పిల్లల్లో నులి పురుగులు ఉండడం వల్ల పోషకాహార లోపం, రక్తహీనత, బలహీనత,ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, వికారం, అతిసారం మరియు బలహీనత వంటివి జరుగుతాయని అన్నారు. 1-5 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో, 6-19 సంవత్సరాల పిల్లలకు పాఠశాలల్లో, కళాశాలల్లో మాత్రలు వేస్తారని తెలిపారు. మాత్రలు వేసుకోవడం వల్ల రక్తహీనత నియంత్రణ జరగడంతో పాటు పోషకాహార లోపం కూడా లేకుండా చూసుకోవచ్చు అని తెలిపారు. ఈ విషయాలన్నీ విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎండి సమియోద్దీన్, శ్రీపతి, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి, డిపిహెచ్ న్ ఓ శోభ రాణి, డిపిఓ రాజేందర్, హెచ్ ఈ ఓ సత్యనారాయణ ,డెమో తులసి రమణ పాల్గొన్నారు.