కరోనా వైరస్తో బ్రా కు మార్కెట్
బీజింగ్, జనవరి 31
కరోనా వైరస్ వల్ల చైనాలో పరిస్థితి దయనీయంగా మారింది. ప్రజలకు బయట అడుగుపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచం వ్యాప్తంగా 10 వేల మందికి కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. 17 దేశాల్లో ఇప్పటివరకు 213 మంది మరణించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడికల్ ఎమర్జన్సీని ప్రకటించింది.వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో ప్రజలు తమ శరీరాన్ని పూర్తిగా కట్టుకుంటున్నారు. మాస్కులు ధరిస్తేగానే బయటకు అడుగు పెట్టడం లేదు. ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఉహాన్‌లో దాదాపు జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో రహదారులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.కరోనా వైరస్ ప్రబలిన తర్వాత మాస్కులకు డిమాండు బాగా పెరిగింది. మాస్కుల కొరత వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అయితే, కొందరు మాత్రం ప్రత్యామ్నయ మార్గాల్లో మాస్కులను తయారు చేస్తున్నారు. మహిళలు ధరించే ‘బ్రా’లను రెండుగా కత్తిరించి ఉపయోగిస్తున్నారు. కప్పు ఆకారంలో ఉండటం వల్ల అవి ముక్కు, నోళ్లను మూయడానికి సరిగ్గా సరిపోతున్నాయని అంటున్నారు. దీంతో బ్రాలకు కూడా డిమాండ్ పెరిగింది. కొందరు డైపర్లు, శానిటరీ నాప్కిన్, నిమ్మ లేదా నారింజ తొక్కలను మాస్కులుగా ధరిస్తున్నారు. ఆ ‘చిత్రాల’ను కింది ట్వీట్లలో చూడండి.