YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అప్పులతో కుదేలవుతున్న రైతులు

అప్పులతో కుదేలవుతున్న రైతులు

అప్పులతో కుదేలవుతున్న రైతులు
అనంతపురం, ఫిబ్రవరి 1,
ఏ ప్రభుత్వమెచ్చినా చెప్పే మాటలు తాము రైతుపక్ష పాతులమని. వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబెతూనే ఉంటారు. అయితే ఆచరణలో చూస్తే రైతాంగం ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ వారం రోజుల్లో ఇద్దరు రైతులు రుణపాశానికి బలయ్యారు. కనగానపల్లి, బుక్కపట్నం రెండు మండలాల్లోనూ ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. వారి మరణానికి కారణం ఒక్కటే. అప్పుల బాధలే ఉన్నాయి. వేసిన పంటలు చేతికందకపోవడం, సరైన గిట్టుబాటు ధర లేకపోవడం కారణాలని చెప్పవచ్చు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని మార్పు సందర్భంగా పెద్దఎత్తున రాష్ట్రాభివృద్ధిపైన చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాయలసీమ ప్రాంతాభివృద్ధి ప్రస్తావన సాగుతోంది. అయితే ఈ చర్యలు, రాజకీయాలు ఏవి ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న రైతుల సమస్యలపై లేకపోవడం విచారకరం. రైతుల ఆత్మహత్యలు చూసినప్పుడు దేశంలో సరళీకరణ ఆర్థిక విధానాలు మొదలైనప్పటి నుంచి ప్రారంభమయ్యాయి. 1990 నుంచి ఇప్పటి వరకు రైతాంగ ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారికంగానే వెయ్యి మందికిపైగా ఈ సంఖ్య చేరింది. ఇక అనధికారికంగా మూడింతలు సంఖ్య ఉంటుందన్నది లెక్క. ఇంతటి తీవ్రమైన పరిస్థితులు జిల్లాలో నెలకొని ఉన్నాయి. వీటి నిలువరిస్తామని పాలకులు చెప్పడం మినహా నిజంగా వాటి నివారణకు తీసుకున్న చర్యలేవి ఉండడం లేదు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. రూ.2700 కోట్లు రుణమాఫీ అని వెయ్యి కోట్ల వరకు చేసి, తక్కినవి చేస్తామంటూనే ఐదేళ్ల కాలం గడిపేసింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ అప్పులను మాఫీ చేయలేమని చెతులెత్తేసింది. కనీసం 2018లో జరిగిన పంటనష్టానికి సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ అయినా ఇస్తుందని అందరూ ఎదురు చూశారు. అవి కూడా వెయ్యి కోట్లకుపైగా రావాల్సి ఉంది. కాని ఇస్తామంటూనే ఏడు మాసాలు గడిపేసింది. కేవలం తొమ్మిది వేలు రైతుల ఖాతాల్లో జమ చేసి ఇదే రైతుకు తామిచ్చే 'రైతు భరోసా' అని గొప్పలు చెప్పుకుంటోంది. 2019వ సంవత్సరంలోనూ సకాలంలో వర్షాలు రాలేదు. అదును తప్పి రావడంతో వర్షాధార పంటలు పూర్తి స్థాయిలో సాగవ లేదు. రబీలో వేసిన పప్పుశనగ పంట దిగుబడి కూడా బాగా తగ్గింది. ఈ రకంగా రైతులు కష్టాల్లో నుంచి గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వాలు ఆదుకుంటామని చెప్పడం, ఆచరణలో రిక్తహస్తాలు చూపించడం జరుగుతూనే ఉంది. ఇక అధికార,ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ప్రధాన సమస్యలపై కాకుండా రాజధాని అమరావతిలో ఉండాలా, వద్దా అన్న దానిపైనే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ తమ పార్టీ అధినేతల దృష్టిలో పండేందుకే తాపత్రయపడుతుండటం శోచనీయం. ఈ వారం రోజులు రాజధాని మార్పుపై అసెంబ్లిలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా టిడిపి, వైసిపిలు ఇక్కడ ప్రదర్శనలు చేపట్టాయి. వాటితో ఇక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. పోటాపోటీగా రెండు పార్టీల నాయకులు కార్యక్రమాలు చేపట్టారు.

Related Posts