తెలంగాణ బడ్జెట్ కోసం కసరత్తులు
హైద్రాబాద్, ఫిబ్రవరి 1,
కేంద్ర బడ్జెట్ ఎట్లుండబోతుందని రాష్ట్ర సర్కారు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. రాష్ట్ర పథకాలకు కేంద్రం నిధులిస్తదా లేదా అని టెన్షన్ పడుతోంది. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తమని సీఎం కేసీఆర్ ఈమధ్య ప్రకటించడంతో ఆ ప్రభావం నిధుల కేటాయింపుపై ఉండొచ్చని అధికారులు అనుకుంటున్నారు. ఏదేమైనా రాష్ట్ర బడ్జెట్ ప్రిపరేషన్‌ను ఆర్థిక శాఖ ఇప్పటికే స్టార్ట్ చేసింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపులు చూశాక వేగం పెంచనుంది. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు 21 శాతం నుంచి 9.5 శాతానికి పడిపోయిందని సీఎం కేసీఆరే స్వయంగా తెలిపారు. కాబట్టి 2019–-20 బడ్జెట్‌కు దగ్గర్లోనే 2020–-21 బడ్జెట్ ఉండొచ్చని అధికారులు అంటున్నారు. 2019–-20 బడ్జెట్ రూ. 1.46 లక్షల కోట్లని, 2020–21కి రూ. 1.50 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ. 5 వేల కోట్లు జీఎస్టీ బకాయిలు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయి. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీంలకు నిధుల విడుదలలోనూ లేటవుతోంది. గత వారం 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కలిసి మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చులు భరించాలని కోరారు.విడుదల చేసే జీవోల విషయంలోనూ, తీసుకోబోయే నిర్ణయాల్లోనూ అత్యంత గోప్యతను పాటిస్తున్న టీఆర్‌ఎస్ సర్కారు.. ఆఖరుకు రాష్ట్ర ప్రజలకు అత్యంత ముఖ్య మైన బడ్జెట్ అంశంలోనూ అదే విధమైన వైఖరిని ప్రదర్శిస్తున్నది. వాస్తవానికి వార్షిక పద్దులోని అంకెలు, సంఖ్యలు, గణాంకాలు లీకు కాకుండా ఆయా ప్రభుత్వాలు జాగ్రత్త పడుతుండటం సాధార ణమే. కానీ బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో మాత్రం వివిధ శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులను భాగస్వాములను చేయటం పరిపాటి. వారితో నాలుగైదుసార్లు చర్చలు, సమాలోచనలు, సంప్రదింపులు జరపటం ద్వారా డిపార్టుమెంట్ల ప్రాధాన్యతలు, అవసరాలను ఆర్థికశాఖ గుర్తిస్తుంది. తద్వారా ఆయా శాఖలకు నిధుల కేటాయింపుపై ఒక అంచనాకు వస్తుంది. గతేడాది ఇచ్చిన డబ్బుకు ఈసారి అదనంగా ఇవ్వాలా..? లేక తగ్గించాలా...? అనే విషయాన్ని నిర్దారిస్తుంది. దీంతో బడ్జెట్ రూపకల్పనకు సమగ్రత, పరిపూర్ణత చేకూరుతాయంటూ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా టీఆర్‌ఎస్ సర్కారు వ్యవహరిస్తున్నది. వివిధ శాఖలు తమ ప్రతిపాదనలన్నింటినీ ఆన్‌లైన్లో సమర్పించాలంటూ ఆర్థిక శాఖ డిసెంబరులోనే జీవో జారీ చేసింది. గతంలో కూడా ఈ పద్ధతి ఉన్నప్పటికీ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో విడివిడిగా పలు దఫాలు భేటీలు నిర్వహించేవారు. కానీ ఈసారి అలాంటి వాతావరణం మచ్చు కైనా కానరావట్లేదు. పాత సచివాలయానికి తాళాలేసిన తర్వాత.. మంత్రులు, ఉన్నతాధికారులు తలోదిక్కుకు తమ కార్యాలయాలను తరలించారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అరణ్య భవన్‌లో కొలువు దీరగా... ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులు బీఆర్‌కే భవన్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆ శాఖకు.. ఇతర డిపార్టుమెంట్లకు మధ్య ఎంతో అంతరం ఏర్పడిందని అక్కడి అధికారులు చెబుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్లో పంపిన ప్రతిపా దనలపై ఎలాంటి చర్చల్లేకుండానే బడ్జెట్ పద్దును రూపొందిస్తున్నట్టు సమాచారం. ఒకరిద్దరు మంత్రులు, ముఖ్య కార్యదర్శులు బీఆర్‌కే భవన్‌కు వచ్చి.. తమ శాఖలకు ఈసారి ఎక్కువ నిధులు కేటాయించాలం టూ చెప్పినప్పటికీ.. వారి మొరను ఆలకించిన వారే లేకపోవటం గమ నార్హం. దీంతో శాఖల ప్రతిపాదనలు, వాటిపై సమాలోచనలనేవి నామ్‌కే వాస్తేగా తయారయ్యాయి. మరోవైపు పద్దు రూపకల్పనలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావే కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది.