YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

 తెలంగాణలో మళ్లీ విద్యుత్ కోతలు

 తెలంగాణలో మళ్లీ విద్యుత్ కోతలు

 తెలంగాణలో మళ్లీ విద్యుత్ కోతలు
హైద్రాబాద్, ఫిబ్రవరి 1,
తెలంగాణలో అనధికారిక విద్యుత్ కోతలు అమలుకానున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీ వరకూ ఇవి కొనసాగుతాయని ట్రాన్స్‌క్సో,జెన్‌కో అధికారులు చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్, రామగుండం, కాకతీయ థర్మల్ కేంద్రాల్లో మరమ్మతుల కారణంగా విద్యుత్ ఉత్పిత్తిని షట్‌డౌన్ చేశారు. ఒడిశాలోని తాల్చేర్ ఎన్‌టీపీసీ థర్మల్ కేంద్రం నుంచి కర్నాటక కోలార్ విద్యుత్ గ్రిడ్‌కు రోజూ 1000- 2000 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా జరుగుతోంది. తాల్చేర్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 500 మెగావాట్లకు సంబంధించిన మరమ్మతులు చేపడుతున్నందున విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. దీంతో తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాలో కోత తప్పలేదని అధికారులు స్పష్టం చేశారు. తూర్పుపవర్‌గ్రిడ్ నుంచి దక్షిణ సదరన్ గ్రిడ్‌కు తాల్చేర్ నుంచి కర్నాటకలోని కోలార్ పవర్‌గ్రిడ్‌కు విద్యుత్ సరఫరా అవుతోంది. విద్యుత్ కారిడార్ నుంచి కొంత విద్యుత్‌ను తెలంగాణకు వాడుకుంటున్నామని చెప్పారు. తెలంగాణతో పాటు రాయలసీమ జిల్లాలకు కూడా వారం రోజుల పాటు విద్యుత్ కోతలు తప్పవని అంటున్నారు. దాదాపు దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కవగా తాల్చేర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న కారిడార్ నుంచి సదరన్ గ్రిడ్‌కు విద్యుత్ సరఫరాకు కొంత సమయం పట్టవచ్చని అంటున్నారు. తాల్చేర్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో మరమ్మతులు చేపడుతున్నందున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరాకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విద్యుత్ కారిడార్ ద్వారా అవసరాన్ని బట్టి రోజూ తాల్చేర్ నుంచి గురు,శుక్రవారాలు 1000 మెగావాట్లు, ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకు 2000 మెగావాట్లు, ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 1000 మెగావాట్లు విద్యుత్ రావాల్సి ఉంది. అయితే రిపేర్ల కారణంగా తెలంగాణకు రావాల్సి విద్యుత్ రాకపోవడంతో కోతలు అనివార్యమని అధికారులు చెబుతున్నారు. కాగా తెలంగాణలో రామగుండం, కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పిత్తిని షట్‌డౌన్ చేశారు. అలాగే చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను నిలిపివేశారు. మరోపక్క తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో విద్యుత్ వినియోగం బాగా తగ్గింది. ఈనెల 29న 139 మిలియన్ల యూనిట్ల విద్యుత్ వినియోగం పడిపోయిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు1000 మెగావాట్ల విద్యుత్ తగ్గింది. వాతారణం చల్లబడడమే దీనికి ప్రధాన కారణం

Related Posts