YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం

2020-2021 బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Highlights

1.మరో 5 కొత్త స్మార్ట్ సిటీలు ఏర్పాటు
2.త్వరలో చెన్నై-బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ వే
3.బెంగుళూరులో సబర్బన్ రైల్వే వ్యవస్థ కోసం రూ.1800 కోట్లు
4. మరిన్ని తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు: నిర్మల
5. 2023 నాటికి ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు
6. భారతీయ రైల్వేకు చెందిన స్థలంలో అతిపెద్ద సోలార్ పవర్ కెపాసిటీ ఏర్పాటు
7.వాణిజ్యశాఖకు రూ.27300 కోట్లు కేటాయింపు
8.స్వచ్ఛ భారత్‌కు రూ. 12,300 కోట్లు కేటాయింపు
9.ఆరోగ్య రంగం కోసం సమగ్ర స్కీం
10.ప్రతీ జిల్లా ఎక్స్పోర్ట్ హబ్గా అభివృద్ధి
11.రూ.99,300 కోట్లు విద్యారంగానికి, రూ.3000 కోట్లు నైపుణ్యాభివృద్ధికి కేటాయింపు
12.టీచర్లు, పారామెడికల్ స్టాఫ్, నర్సులకు డిమాండ్ ఉంది వారికి బ్రిడ్జి కోర్స్ అందిస్తాం
13.జిల్లా స్థాయిలో ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల ఏర్పాటు
14.నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు: నిర్మల
15.డిగ్రీ స్థాయిలో ఆన్లైన్ కోర్సులు: నిర్మల
16.మార్చి 2021 నాటికి అప్రెంటీస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు: నిర్మల
17.కొత్త ఎడ్యుకేషన్ పాలసీ త్వరలో ప్రకటిస్తాం: నిర్మల
18.2024 నాటికి జన్ ఔషధి కేంద్ర పథకం ద్వారా 2000 మెడిసిన్స్, 300 సర్జికల్స్ అందించేందుకు కృషి: నిర్మల
19.వ్యవసాయానికి, వ్యవసాయ సంబంధిత పథకాలకు రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు: నిర్మల
20.చేపల పెంపకంలో గ్రామీణ ప్రాంత యువతకు అవకాశాలు: నిర్మల
21.2023 నాటికి 200 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యం: నిర్మల
22.నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, కోఆపరేటీవ్ బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.15 లక్షల కోట్లు: నిర్మల
23.త్వరగా పాడైపోయే ఆహారపదార్థాల రవాణాకు సహకారం
24.విమానయాన సంస్థ నుంచి 'కృషి ఉడాన్' పథకం
25.గ్రామీణ మహిళలకు ముద్ర రుణాలు, నాబార్డ్ ఆర్థిక సహకారం
26.నీటి లభ్యత లేని 100 జిల్లాలను గుర్తించాం వాటికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం
27.తాలుకా స్థాయిలో వేర్ హౌజ్ ఏర్పాటు చేసేవారికి ప్రోత్సాహకాలు
28.రైతులు ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తు అమ్ముకోవచ్చు
29.ఇటీవల రూపొందించిన వ్యవసాయ సంబంధిత చట్టాలను అమలు చేసే రాష్ట్రప్రభుత్వాలను ప్రోత్సహిస్తాం
30.రైతుల కోసం 16 యాక్షన్ పాయింట్స్ 

 

2020-2021 బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

 

2020-2021 బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నాం: నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రసంగంలో కాశ్మీర్ కవితను చదవి వినిపించిన నిర్మల జీఎస్టీ వల్ల ప్రతీ కుటుంబానికి 4శాతం ఆదా అయ్యింది ఈ బడ్జెట్ మూడు కీలక అంశాలతో రూపొందించినది. ఒకటి ఆశావహ భారతం, రెండోది ఆర్థికాభివృద్ధి, మూడోది సమాజ సంరక్షణ. ఏప్రిల్ 2020 నుంచి పన్ను చెల్లింపులు ఇంకా సరళతరం కానున్నాయి. చెక్‌పోస్టులను తొలగించడంతో 10% పన్ను భారం తగ్గింది . ఒకే దేశం ఒకే పన్ను విధానం సరైన ఫలితాలను ఇచ్చింది. జీఎస్టీ తీసుకొచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెరిగింది. ప్రజల ఆదాయాన్ని పెంచడమే బడ్జెట్ లక్ష్యం. గత రెండేళ్లలో 16 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు పెరిగారు ప్రజల ఆదాయంతో పాటు కొనుగోలు శక్తిని పెంచే బడ్జెట్ ఇది ప్రజలకు సేవచేసే విషయంలో కట్టుబడి ఉన్నాం



 

Related Posts