YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

 మెదక్ లో యదేఛ్చగా  గ్రానైట్ పేలుళ్లు

 మెదక్ లో యదేఛ్చగా  గ్రానైట్ పేలుళ్లు

 మెదక్ లో యదేఛ్చగా  గ్రానైట్ పేలుళ్లు
మెదక్, ఫిబ్రవరి 1,
గ్రామానికి అరకిలో మీటరు దూరంలో బోలుగు బండ(గుట్ట). ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 12 ఏళ్ల క్రితం రెండున్నర ఎకరాలకు స్టోన్‌క్రషర్‌ ఏర్పాటుకు లీజుకు తీసుకోని క్రషర్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి క్రషర్‌ను విస్తరించే దిశగా లీజుకు తీసుకున్న వ్యక్తులు నింబంధనలను తుంగలో తొక్కుతూ వ్యాపారాన్ని విస్తరిస్తూ వస్తున్నారు. మైనింగ్‌ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా పేలుడు పదార్థాలను ఇష్టారీతిగా వాడుతుండటంతో ఆ శబ్ధాలకు చుట్టు పక్కల ఉన్న పొల్లాలోని బోర్లు కూలుతుండటంతో పాటు పొలాలోకి వచ్చి పడుతున్న రాళ్లు, దుమ్ముతో ఇక్కడ వ్యవసాయం సాగక బీడుగా ఉంచవల్సిన దుస్థితి. అది కాక పక్కనే ఉన్న ఇందిరానగర్‌ కాలనీలోని ఇళ్ల గోడలు కూడా బీటలు పారుతున్నాయి.స్టోన్‌ క్రషర్‌ యజమానులకు నాయకులతో పాటు, అధికారుల అండదండలు పుష్కలంగా  ఉన్నాయని స్థానికులు చర్చిం చుకుంటున్నారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణానికి మైనింగ్‌ ద్వారా లీజుకు అనుమతి పొందిన సదరు యాజమానులు చుట్టు పక్కల ఉన్న రైతులను నయానో, భయానో బెదిరించి.., నాయకులను మచ్చిక చేసుకోని నాలుగు ఎకరాలకు విస్తరించారు.  అధికారులకు లక్షల్లో సొమ్ము ముట్టజెప్పడంతో వీరి వ్యాపారానికి అడ్డు అదుపు లేకుం డా పోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ కంకర వ్యాపారం సాగిస్తున్న వ్యాపారులు మైనింగ్‌ నిబంధనలను ఏ మాత్రం పాటించడం లేదు. నిర్ధేశించిన లోతు కన్నా ఎక్కువ మేర తవ్వ కం చేపడుతున్నారు. కంకర రవాణలోనూ ఇదే పరిస్థితి. తెల్ల కాగితాలపై బిల్లులు ఇస్తూ ఇష్టారీతిగా రవాణా సాగిస్తున్నారు. వేబిల్‌ ఎక్కడా కానరాని దుస్థితి.  

Related Posts