YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా ఆంధ్ర ప్రదేశ్

 పింక్ లో పవన్ రేణు

 పింక్ లో పవన్ రేణు

 పింక్ లో పవన్ రేణు
హైద్రాబాద్, ఫిబ్రవరి 1,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా చూస్తున్నారో.. పొలిటికల్ సర్కిల్స్‌లోనూ ఆయన మూవీపై అమితాసక్తి కనపరుస్తున్నారు. జనసేన పార్టీ స్థాపన తరువాత ఫుల్ టైం పొలిటికల్ లీడర్‌గా ఉండబోతున్నానంటూ సినిమాలకు స్వస్తి చెప్పిన పవన్ కళ్యాణ్.. అదే పార్టీని నడిపేందుకు సినిమాలనే ఆర్ధిక వనరుగా మలుచుకుని మళ్లీ యూటర్న్ తీసుకున్నారు.బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలాంటి హడావుడి లేకుండా ‘పింక్’ రీమేక్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీపై రకరకాల వార్తలు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పింక్ మూవీలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలకపాత్ర చేయబోతోందట. బద్రి, జానీ సినిమాలతో జోడీ కట్టిన పవన్-రేణు దేశాయ్‌లు ఆ తరువాత రియల్ లైఫ్ పార్టనర్స్‌గా మారి.. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.కాగా ఈ ఇద్దరి కాంబోకు మంచి క్రేజ్ ఉండటంతో పవన్-రేణు దేశాయ్‌లను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చేందుకు దర్శకుడు వేణు శ్రీరామ్‌ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పింక్ రీమేక్‌లో చైల్డ్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు ఉండబోతున్నాయని.. అందులో ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌కి తల్లిగా రేణు దేశాయ్‌ని అడిగినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో కీలకమైన ముగ్గురు యువతుల్లో ఒకరికి తల్లిగా చేయబోతుందనే వార్తలు వస్తున్నాయి.అయితే హీరోయిన్‌గా మూవీ కెరియర్‌కి స్వస్తి చెప్పిన రేణు దేశాయ్.. ప్రస్తుతం ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు తెలుగులో మంచి పాత్రలు వస్తే చేస్తానని ప్రకటించిన రేణు దేశాయ్.. శుక్రవారం నాడు విడుదలైన ‘చూసీ చూడంగానే’ చిత్రంలో తల్లి క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చినప్పటికీ హెల్త్ బాలేక వదలుకున్నట్టు చెప్పారామె. మరి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పవన్ రీ ఎంట్రీ మూవీలో రేణు చేస్తుందా లేదా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇటీవల షూటింగ్ లొకేషన్ పిక్స్ లీక్ కావడంతో పవన్ సీరియస్ అయ్యారని.. అందుకే ఎలాంటి లీక్‌లు భయటకు వెళ్లకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు వహిస్తోంది.

Related Posts