తిరుమలలో వేడుకగా ప్రారంభమైన సూర్యజయంతి వేడుకలు
తిరుమల ఫిబ్రవరి 1,
తిరుమలలో సూర్యజయంతి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా మలయప్ప స్వామి నేడు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన స్వామి వారి వాహనసేవ.. ఆ తరువాత చిన్నశేష, గరుడ, హనుమంత, చక్రస్నానం, కల్పవృక్ష, సర్వభూపా, చంద్రప్రభ వాహనాలపై భక్తులకు కోనేటిరాముడు దర్శనమివ్వనున్నాడు. కాగా, రధసప్తమిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో అన్ని అర్జిత, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. మరోవైపు తిరుమలేశుని దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ నిండి వెలుపలకి క్యూలైన్లు వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా.. టైం స్లాట్, సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం నాడు 62482 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.