YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఇది సామాన్యుల బడ్జెట్

ఇది సామాన్యుల బడ్జెట్

ఇది సామాన్యుల బడ్జెట్
వ్యవసాయం, సాగునీరు గ్రామీణాభివృద్ధి పెద్దపేట,    ద్వితీయ ప్రాధాన్యాంశంగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు,    మూడో ప్రాధాన్యాంశంగా విద్య, చిన్నారుల సంక్షేమం 
             ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 1  
ఇది సామాన్యుల బడ్జెట్ అని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వ్యవసాయం, సాగునీరు గ్రామీణాభివృద్ధి కి తమ ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యతనిస్తున్నదని ఆమె తెలిపారు. 2020-21 బడ్జెట్‌ను శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ద్వితీయ ప్రాధాన్యాంశంగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు తీసుకున్నామని, మూడో ప్రాధాన్యాంశంగా విద్య, చిన్నారుల సంక్షేమం తీసుకున్నామని మంత్రి తెలిపారు.  2019 మే ఎన్నికల్లో మోదీ నాయకత్వానికి భారీ మెజారిటీతో ప్రజలు అధికారం అప్పగించారని, ప్రజలు ఇచ్చిన తీర్పుతో పునరుత్తేజంతో మోదీ నాయకత్వంలో భారత అభివృద్ధికి పనిచేస్తున్నామని ఆమె అన్నారు. ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్‌ ఉంటుందని నిర్మల తెలిపారు.యువతను మరింత శక్తిమంతం చేసే దిశగా ప్రభుత్వ ప్రాధమ్యాలు ఉంటాయని, సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం అని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకెళ్తుందని ఆమె అన్నారు. జీఎస్టీ ప్రవేశపెట్టాక దేశవ్యాప్తంగా పన్ను విధానంలో పారదర్శకత నెలకొని ఉందని ఇది దేశానికి ఉపయుక్తంగా ఉందని ఆమె అన్నారు.భారత్‌ ఇప్పుడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2019లో కేంద్రంపై రుణభారం 48.7 శాతం తగ్గిందని, 284 బిలియన్‌ డాలర్ల స్థాయికి ఎఫ్‌డీఐలు చేరాయని ఆమె తెలిపారు. 2006-16 మధ్య పేదరికం నుంచి 22 కోట్ల మంది ప్రజలు బయటపడ్డారని ఆమె ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ మూలాల బలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎలాంటి ప్రమాదం లేదని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా పేదలందరికి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని ఆమె తెలిపారు. యువత ను మరింత శక్తిమంతం చేసే విధంగా ప్రభుత్వ ప్రాధాన్యతలు ఉంటాయని మంత్రి తెలిపారు.2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపునకు కట్టుబడి ఉన్నాం. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాం. కృషి సించాయి యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం కల్పిస్తున్నాం. గ్రామీణ సడక్‌ యోజన, ఆర్థిక సమ్మిళిత రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి అని కేంద్ర మంత్రి వివరించారు.వర్షాభావ జిల్లాలకు అదనపు నిధులు సమకూరుస్తున్నట్లు నిర్మల తెలిపారు. అదే విధంగా రైతులకు 20 లక్షల సోలార్ పంపుసెట్లు పంపిణీ చేస్తామని ఆమె వెల్లడించారు. పొలాలు, రైతుల ఉత్పాదకత పెంచడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని, కూరగాయలు పండ్లు పూల ఎగుమతుల సరఫరాకు కృషి ఉడాన్ యోజన ప్రవేశపెట్టామని ఆమె తెలిపారు.

Related Posts