అరసవిల్లిలో ఒకరోజు బ్రహోత్సవం
శ్రీకాకుళం ఫిబ్రవరి 1
శ్రీకాకుళం అరసవిల్లి సూర్య దేవాలయం భక్తులు తో కిటకిటలాడింది. రాష్టవ్యాప్తంగా వచ్చిన భక్తులు సూర్యజయంతి సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకొని తరించారు. ఇంద్రపుష్కరణి వద్ద పాయసం వండి నైవేద్యాలు పెట్టి మొక్కుబడులు చెల్లించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ అధికార్లు పోలీస్, రెవిన్యూ, ఫైర్ సిబ్బంది సహకారం తీసుకున్నారు.సూర్యజయంతి రథసప్తమి సందర్భంగా ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లిలో శ్రీ సూర్యనారా యణస్వామి వారి జయంత్యుత్సవం... ఒకరోజు బ్రహ్మోత్సవంగా బ్రహ్మండమైన రీతిలో జరిగింది. మంగళవాయి ద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రాంగణమంతా ఆదిత్యుని నామస్మరణతో మార్మోగింది. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆర్అండ్బి మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఉత్సవ అధికారి ఎన్.సుజాత, జిల్లా సహాయ కమిషనర్ వై.భద్రాజీ, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్ తదితరులు స్వామి వారికి సంప్రదాయం ప్రకారం పట్టువ్రస్తాలను సమర్పించారు