YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

#RRR లో ఇంకో R యాడ్ అవుతుందా..? లేదా?

#RRR లో ఇంకో R యాడ్ అవుతుందా..? లేదా?

 #RRR పేరుతో 23 సెకన్ల నిడివికల వీడియోను రాజమౌళి..రామారావు..రామ్‌చరణ్‌ ఆంగ్ల పేర్లలో మొదటి అక్షరం ‘R’ వచ్చేలా పంచుకున్నారు. ఇప్పుడు ఈ మూడు ‘R’లలో మరో ‘R’ ప్రముఖ నటుడు రాజశేఖర్‌ ఇందులో విలన్ పాత్రలో నటించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. రాజమౌళి సినిమాల్లో హీరో పాత్రలకు దీటుగా ప్రతినాయకుడు పాత్రలూ ఉంటాయి. ఈ సినిమాలో విలన్‌గా రాజశేఖర్‌ అయితేనే బాగుంటుంది అని రాజమౌళి భావించారని తెలుస్తుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై ఈ మల్టీస్టారర్‌ సినిమా తెరకెక్కనుంది.  ఇందులో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ సోదరుల్లా నటిస్తారని తాజా సమాచారం. బాక్సింగ్‌ నేపథ్యంలో సినిమా ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం. తారక్‌, చరణ్‌ పాత్రలకు సంబంధించి ఇటీవల అమెరికాలో ఫొటో షూట్‌ చేశారని కూడా ఒక టాక్ వినిపిస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.

Related Posts