YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఉద్యోగం అడగవద్దు ఇచ్చే స్థాయికి రండి

ఉద్యోగం అడగవద్దు ఇచ్చే స్థాయికి రండి

ఉద్యోగం అడగవద్దు ఇచ్చే స్థాయికి రండి
            ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 1  
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మరింత ప్రోత్సాహం కల్పిస్తామని, ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చేలా యువతకు ప్రోత్సాహం కల్పిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.పెట్టుబడి పెట్టే ముందు తగిన శిక్షణ, అవకాశాలపై అవగాహన కల్పించే కేంద్రాలు నెలకొల్పుతున్నామని ఆమె అన్నారు.నూతన పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నట్లు మంత్రి చెప్పారు. మొబైల్‌ ఫోన్ల తయారీ, సెమీ కండక్టర్ల పరిశ్రమల కోసం ప్రత్యేక పథకం, త్వరలో విధివిధానాలు రూపొందిస్తామని అన్నారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్తగా 5 ఆకర్షణీయ నగరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు.దేశంలో జౌళి పరిశ్రమ మరింత అభివృద్ధికి త్వరలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా జాతీయ జౌళి సాంకేతికత మిషన్‌ ద్వారా కొత్త పథకం అమలు అవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఏడాది నుంచి ఎగుమతిదారులకు ప్రోత్సాహక పథకం ప్రవేశపెడుతున్నామని నిర్మల తెలిపారు. చిన్నతరహా ఎగుమతిదారులకు రక్షణగా నిర్విక్‌ పేరుతో కొత్త బీమా పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు.2030 నాటికి అత్యధికంగా పనిచేయగలిగిన యువత ఉండే దేశంగా భారత్‌ రూపకల్పన జరుగుతుందని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అప్రెంటీస్‌ విధానం అమలు చేస్తామని, దేశంలో వైద్య నిపుణుల కొరత తీర్చేందుకు కొత్త విధానం తీసుకువస్తున్నామని నిర్మల అన్నారు. ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.భూమి, సౌకర్యం కల్పించే రాష్ట్రాలకు కేంద్రం నుంచి సాయం అందిస్తామని అన్నారు. అదే విధంగా వైద్య పీజీ కోర్సుల కోసం పెద్దాస్పత్రులకు ప్రోత్సాహం కల్పిస్తామని అన్నారు. విద్యారంగంలో మార్పుల కోసం ప్రత్యేక నూతన విద్యా విధానం అమలు చేస్తామని, 2026 కల్లా 150 వర్సిటీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడతామని ఆమె చెప్పారు.ఈ ఏడాది విద్యారంగానికి రూ.99,300 కోట్లు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ.3 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. వర్సిటీల కోసం త్వరలో జాతీయ స్థాయి విధానం, ఉపాధ్యాయులు, పారా మెడికోల కొరత తీర్చేలా నూతన విధానం ఉంటాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Related Posts